Breaking News

వాలంటీర్లే కాదు వారియర్లు… : నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వారియర్ల లాగా వాలంటీర్లు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గురువారం జరిగిన వాలంటీర్ల పురస్కారాల వేడుకలు అన్నారు.గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  ఎంతో ప్రతిష్టాత్మకముగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థ గత 4 సంవత్సరాలనుండి చేస్తున్న సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవా పురష్కారాల కార్యక్రమం “వాలంటీర్లకు వందనం” లో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి 35 వ డివిజన్ బాప్టిస్ట్ పాలెం 191 వ సచివాలయంలో 34, 35, 54, 55, 56 వ డివిజన్ల వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమాన్ని చేరుస్తూ కొండ మూలలో అయినా, ఎంత కష్టమైనా సరే ఇంటికి వెళ్లి మరీ సంక్షేమాన్ని అందిస్తున్న వాలంటీర్లకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహోన్నతమైన ఆలోచన వాలంటీర్లకు సేవ పురస్కారాలు అందించడం. వాలంటీర్ల కష్టాన్ని, వాళ్ళు చేస్తున్న సేవ మిత్ర, సేవరత్న, సేవ వజ్ర పేర్లతో పురస్కారాలు అందించటం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. గురువారం జరిగిన పురస్కారాల వేడుకలో 247 సేవా మిత్రా పురస్కారాలు వాలంటీర్లకు అందించి, సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ షేక్ ఆసిఫ్, 35వ డివిజన్ కార్పొరేటర్ బలసాని మణిమ్మ, మున్సిపల్ అధికారులు వార్డ్ సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *