Breaking News

9న ప్రజా సోష్టలిస్ట్ కూటమి రాష్ట్ర సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని లేని రాష్ట్రంగా దేశంలోనే పరిస్థితిలో ఉన్నామొ ప్రజలు గుర్తించాలని మరలా ఇటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చేయటం మరొపక్క టిడిపి,జనసేన పార్టీలు కుడా రాష్ట్ర ప్రయోజనాలు కంటే వారి స్వప్రయోజనాలు కోసమే కలయిక జరిగిందని ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ప్రజలకు మంచి జరగాలి అంటే ఉద్దేశంతో పలు చిన్న పార్టీలను కలుపుకుని ప్రజా సోష్టలిస్ట్ కూటమిగా ఏర్పడినాము రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయబోతున్నామని మతను ఆదరించాలని మన రామరాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, కూటమి అధ్యక్షులు ఎమ్.కె.యస్. ధనుష్, ఉపాధ్యక్షులు లామ్ జై బాబు తెలిపారు. మంగళవారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి అధ్వర్యంలో ఈనెల 9న నందిగామలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.రాష్ట్రంలో దళిత గిరిజనులపై దాడులు, హత్యలు అక్రమ కేసులు పెరిగాయన్నారు. రాష్ట్రాఅభివృద్ధి కుంటూ పడిందని, సమాజం విలువలు దిగజారి ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం అసులు అమలు జరగటం లేదన్నారు. జనాభా లెక్కలు ప్రకారం ఏ కుల జనాభా ఎంతో ఆ కులానికి అంతేవాట కల్పించాలని, మన రామరాజ్యం పార్టీ రాముడు పేరుతోనే మరో దేవత పేరుతోనో ఓట్లు అడగదన్నారు. రాష్ట్రంలో, దేశంలో పౌర సమాజానికి నాణ్యమైన జీవితాన్ని అందించేందుకు నాణ్యమైన విద్యా, వైద్యం అందించేందుకు దేశంలో ఒక గొప్ప సమాజ మార్పుకు కృషి చేస్తుందన్నారు. దేశంలో లౌకికవాదం, సోషలిజం వంటి అవసరాలు రాజ్యాంగం కల్పిస్తే వాటిని తొలగించాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఏపికి ప్రత్యేక హెూదా, విభజన చట్టం హామీలు సాధనకోసం అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు కలసి కూటమిగా ఏర్పడిన ప్రజా సోషలిస్టు కూటమి పోటీ చేసే అన్ని స్థానాల సభ్యులను గెలిపించాలని అన్నారు. సోషలిస్టు భావాలు ఉన్న దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నికపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. దీనిపై సమగ్రచర్చ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కొరగంటి హనుమంతరావు, కె.రమేష్ న్యాయవాది పొదిలి వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *