Breaking News

సీఎం జగన్ కు, నాకు ప్రజాసేవ చేయడానికి లూర్దు మాత, దేవదేవుడైన యేసు ప్రభువు మరోసారి అవకాశం కల్పించాలి – ఎమ్మెల్యే కొడాలి నాని

-వేన్ననపూడి లూర్దుమాత ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని….
-మానవాళి హితం కోరుతూ ఆర్సిఎం ఫాదర్లతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాని….
-వెన్నెనపూడి గ్రామం, లూర్ధు మాత ఉత్సవాలతో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉంది – ఎమ్మెల్యే నాని…

నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందివాడ మండలం వెన్నెనపూడి గ్రామంలో గత మూడు రోజులుగా జరుగుతున్న లూర్దు మాత మహోత్సవాలు సోమవారం రాత్రితో అత్యంత వైభవంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే నానికు గ్రామ సెంటర్లో యువత, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సెంటర్లోని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని, చర్చికు కాలి నడకన బయలుదేరారు. దారి పొడువున క్రైస్తవ విశ్వాసులు, గ్రామస్తులకు అబివాదాలు ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే కొడాలి నానితో సెల్ఫీ ఫోటోలు దిగేందుకు యువత పోటీపడ్డారు. తొలుత చర్చి ప్రాంగణంలో లూర్దు మాత, ఏసుప్రభు స్వరూపాల వద్ద ఎమ్మెల్యే నాని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.సి.యం ఫాదర్ లను సత్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని, వారి వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఫాదర్ లతో కలిసి ఉత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ మహిమాన్వితమైన లూర్ధు మాత ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. 1980 నుండి 35 ఏళ్ల పాటు నిర్విరామంగా ఉత్సవాల్లో పాల్గొంటున్నట్లు ఎమ్మెల్యే నాని తెలియచేశారు. కోరిన కోర్కెలు తీర్చే మహిమగల తల్లిగా లూర్దు మాతను నేను భావిస్తానని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గత ఎన్నికల్లో మే 23 ఎన్నికల కౌంటింగ్ అయితే 22 రాత్రి 9 గంటలకు చర్చికు వచ్చి ప్రార్థనలు చేసి, తెల్లవారు కౌంటింగ్ కు వెళ్లినట్లు ఎమ్మెల్యే కొడాలి నాని తెలియజేశారు. ఎంతో విశిష్టత కలిగిన లూర్ధు మాత దేవాలయం మా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో ఉండడం పూర్వజన్మ సుకృతం అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. లూర్దు మాత , దేవదేవుడైన ఏసుప్రభువు ఆశీస్సులు నాకు.. నా కుటుంబ సభ్యులకు… గుడివాడ నియోజకవర్గ ప్రజలకు…. మా నాయకుడు సీఎం జగన్ ఆయన కుటుంబ సభ్యులపై ఉండాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు. సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని వెన్ననపూడి తీసుకొస్తానన్నారు, తల్లి ఆశీస్సులు పొందే అవకాశాన్ని లూర్దుమాత , ఏసుప్రభువు కల్పించాలని ఎమ్మెల్యే నాని ప్రార్థించారు. అనంతరం ఆర్.సి.యం ఫాదర్లు, వెన్ననపూడి యూత్ సభ్యులు ఎమ్మెల్యే కొడాలి నానికు గౌరవ సత్కారం చేశారు. ఉత్సవ ముగింపు వేడుకల్లో వైసిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్,ఎంపీపీ పెయ్యల అధామ్, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ, వైసీపీ నాయకులు కందుల నాగరాజు, తోట నాగరాజు, పాలేటి చంటి, ధనాల ఫని, బండి కోటి, వెన్ననపూడి గ్రామ వైసీపీ నాయకులు లింగం సుందర రావు,అట్లూరి చిట్టిబాబు,వెన్ననపూడి యూత్ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *