-9వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో చెన్నుపాటి గాంధీ, గద్దె క్రాంతి కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ బలపరిచిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని టీడీపీ నాయకుడు చెన్నుపాటి గాంధీ, గద్దె క్రాంతి అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లో నగర్లో అపార్ట్మెంట్స్ రోడ్డులో బుధవారం ఉదయం చెన్నుపాటి గాంధీ, గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్ళి కరపత్రాలను అందచేసి వారికి వివరించారు.
ఈ సందర్భంగా చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ టీడీపీ హాయంలోనే తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పారు. గద్దె రామమోహన్ తూర్పు నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించడం ఖాయమని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు తమను అడుగుతున్నారని, ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబునాయుడు నాయకత్వంలో తూర్పు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. గద్దె రామమోహన్ నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎల్లప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపి చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి చెందడం ఖాయమని వైఎస్సార్సీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు బహిరంగంగానే చెబుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
గద్దె క్రాంతి మాట్లాడుతూ గద్దె రామమోహన్ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా నియోజకవర్గాన్ని వివాదాలు, అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉంచారన్నారు. టీడీపీ హాయంలో అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందచేశారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు అరకొరగా అందుతుండంతో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తన సొంత నిధులతో ప్రజా సంక్షేమకార్యక్రమాలను నిర్వహించారని చెప్పారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అనేక ప్రజా సమస్యలను పరిష్కరించారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గద్దె రామమోహన్ కు, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి క్రాంతి యలమంచిలి దేవేంద్ర, అన్నాబత్తుని శ్రీదేవి, యార్లగడ్డ బలరామకృష్ణ, మొటపర్తి లక్ష్మీ, భవానీ, పాగోలు సత్యనారాయణ, గోవిందు, మండవ లక్ష్మీపతి తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News