Breaking News

దోచుకోవడం.. దాచుకోవడం … జగన్మోహన్రెడ్డి నైజం

-ఎన్ఎస్ఎం స్కూల్ గ్రౌండ్లో వాకర్స్తో గద్దె రామమోహన్, కేశినేని శివనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దోచుకోవడం, దాచుకోవడం ముఖ్యమంత్రి వైవెస్. జగన్మోహన్రెడ్డి నైజమని జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామమోహన్ అన్నారు. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎన్ఎస్ఎం స్కూల్ గ్రౌండ్లో వాకర్స్తో ఎమ్మెల్యే గద్దె రామమోహన్, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) కి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా గద్దె రామోమోహన్ కోరారు.

ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ వైఎస్. జగన్మోహన్రెడ్డి పాలన అంతా దోచుకోవడం, దాచుకోవడంతోనే సరిపోయిందన్నారు. ఇసుకను అక్రమంగా తవ్వుకోవడం, తరలించుకోవడమే కాకుండా కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారని చెప్పారు. జగన్ ప్రభుత్వం విక్రయిస్తున్న కల్తీ మద్యాన్ని తాగి రాష్ట్రంలో ఐదు లక్షల మంది మరణించారని, ఇంకా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రజల ప్రాణాలతో సంబంధం లేకుండా తమ ఖజానాకు ఆదాయమే పరమావధిగా జగన్మోహన్రెడ్డి పాలన సాగుతోందన్నారు. కల్తీ మద్యం సరఫరా చాలదన్నుట్లుగా జగన్మోహన్రెడ్డి గంజాయి సరఫరా చేసి యువత భవిష్యత్తును సైతం నాశనం చేస్తున్నారని చెప్పారు. విశాఖలో పెద్ద మొత్తంలో గంజాయి కంటెయినర్ బయటపడిందని చెప్పారు. బ్రెజిల్ నుంచి రాష్ట్రానికి గంజాయికి తీసుకువచ్చి ఇక్కడి యువతకు సరఫరా చేస్తున్నారని అన్నారు. యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ తుడుచుపెట్టుకోవడం ఖాయమని అన్నారు.

ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, తూర్పు నియోజకవర్గానికి గద్దె రామమోహన్ ఎమ్మెలేగా అవసరమని చెప్పారు. చంద్రబాబునాయుడు విజన్ ఉన్న నాయకుడిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళతాడని, స్నేహశీలి, సౌమ్యుడు, సేవాతత్పరుడు అయిన గద్దె రామమోహన్ తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు మంచి చేస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తూర్పు నియోజకవర్గ ఎంతో అభివృద్ధి చెందిందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే తూర్పు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో బొప్పన భవకుమార్, ముమ్మనేని ప్రసాద్, నర్రా కిషోర్, వీరంకి డాంగేకుమారి, గరికపాటి శ్రీనివాస్, గద్దె ప్రసాద్, వెంకయ్య బాబు, ప్రసాద్, బోసు, మోర్ల సుబ్బారావు తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *