-6వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో గద్దె రాజేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి మార్గాలు నిర్వీర్యం చేసి, నిత్యావసర ధరలు, పన్నులు పెంచి సామాన్యుల జీవనమే కష్టంగా మార్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు పెడుతున్న శాపనార్ధాలు తప్పక తగులుతాయని యువ నాయకులు గద్దె రాజేష్ పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం 6వ డివిజన్ మారుతీ నగర్ కోకాకోలా స్ట్రీట్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే, ఎం.పి అభ్యర్ధులు గద్దె రామమోహన్, కేశినేని శివనాథ్ (చిన్ని)ల విజయాన్ని కాంక్షిస్తూ గదె రాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్ళి జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో వివరించారు. అలాగే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గద్దె రాజేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తనది పేదల ప్రభుత్వమంటూ ప్రగల్భాలు పలుకుతుంటారని, కాని జగన్ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయింది పేద, మధ్యతరగతి వారేనన్నారు. మధ్యతరగతి వారిని పేద వారుగా, పేదవారిని కడుపేద వారిగా మార్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచి వేసవిలో ప్యాన్ వేసుకోవడానికి కూడా బయపడేలా చేశాడని, అందుకని రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో ఓటర్ బ్యాలెట్పై సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి, రాష్ట్రంలో ప్యాన్ స్విచ్ ఆపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యలను పరిష్కరిస్తామని గద్దె రాజేష్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మంచికి మారుపేరుగా ఉన్న గద్దె రామమోహన్ను ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజార్టీతో మూడవసారి గెలిపించాలని, అలాగే కేశినేని శివనాథ్ను ఎం.పిగా గెలిపించాలని గద్దె రాజేష్ ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు పడాల గంగాధర్, పల్లి దుర్గాప్రసాద్, అమిర్నేని కరుణ, పడాల ఆదినారాయణ, పి.వాసు, వల్లెపు దుర్గారావు, వనుము దుర్గారావు, షేక్ షకీలా, సప్పా శ్రీను, పిట్టా కనకశివ, మట్టా శివరామ్, వి.సుబ్బారావు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News