గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనను త్వరగా పూర్తి చేయాలని, బిఎల్ఓలు తమ పరిధిలోని ఓటర్లకు పోలింగ్ కేంద్రం వివరాలు తెలియచేయాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి ఇంజినీరింగ్ అధికారులను, బిఎల్ఓలను ఆదేశించారు. గురువారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సెక్టార్ 3 లోని పాత గుంటూరు, వినోభా నగర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను ఏఆర్ఓలు, సెక్టోరల్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులైన ర్యాంప్ లు, ఓటర్ల రాకపోకలకు వీలుగా బ్యారీకేడింగ్, త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యాల కల్పన వేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలు పాఠశాలల్లో ఉన్నందున, కొన్ని గదుల్లో నాడు నేడు పనుల సామాగ్రి, ఇతర మెటీరియల్ ఉంటే వాటిని సంబందిత ప్రదానోపాద్యాయులతో చర్చించి వేరే గదులకు తరలించాలన్నారు. ఒకే కేంద్రంలో ఉండే ఒకటి కంటే అధికంగా పోలింగ్ స్టేషన్లు ఉంటె ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఏఈ భాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కేంద్రానికి సంబందిత పోలింగ్ కేంద్రం నంబర్, బిఎల్ఓ పేరుతో బోర్డ్ లను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను, పోలింగ్ కేంద్రాలను సెక్టోరల్ అధికారులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఏఆర్ఓలు కూడా నియోజకవర్గంలో ర్యాండంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలన్నారు.
అనంతరం బిఎల్ఓలతో గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళి, పోలింగ్ శాతం ఇతర వివరాలు అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ బిఎల్ఓలు తమ పరిధిలో ప్రతి ఓటరు ఓటింగ్ లో పాల్గొనేలా ఓటింగ్ శాతం పెంచాలని, ఓటర్లకు పోలింగ్ స్టేషన్ వివరాలు తెలియచేయాలన్నారు.
పర్యటనలో ఏఆర్ఓలు సునీల్, భీమరాజు, వెంకట లక్ష్మీ, సెక్టోరల్ అధికారులు నాగ శేషు, శ్రీధర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డిఈఈ శ్రీధర్, ఏసిపిలు మురళి, అజయ్ కుమార్, మేనేజర్ ఎస్.ఎన్.ప్రసాద్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News