Breaking News

దాహార్తి తీర్చాడానికి చలివేంద్రాల ఏర్పాటు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పెరుగుతున్న ఎండల దృష్ట్యా నగరంలో ప్రజలకు, నగరానికి విచ్చేసే వారి దాహార్తి తీర్చాడానికి చలివేంద్రాల ఏర్పాటును పూర్తి చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలో చలివేంద్రాల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు పై నగరపాలక సంస్థ ఎస్.ఈ., ఇంజినీరింగ్ అధికారులకు సెట్ ద్వారా తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున నగరంలోని ప్రధాన కేంద్రాల్లో, జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో నగరపాలక సంస్థ తరుపున షుమారు 45 ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా ఇప్పటికే 19 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, మిగిలినవి త్వరగా పూర్తి చేయాలని ఎస్ఈ ని ఆదేశించారు. గుంటూరు నగరానికి ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు చేస్తారని, వారికి త్రాగునీరు అందించడానికి చలివేంద్రాలు ఆవశ్యకమని తెలిపారు. ఏఈ ల వారిగా ఎన్ని చలివేంద్రాలు ఏర్పాటు అవసరం, వాటి ప్రతిపాదనలను పరిశీలించి వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చలివేంద్రాల్లో నిర్దేశిత సమయం వరకు త్రాగునీరు అందించేందుకు తగిన సిబ్బందిని కేటాయిస్తూ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఎస్ఈ ని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *