విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్ రెడీనెస్ టెస్ట్ ను విజయవంతంగా నిర్వహించడమైనది .టోఫెల్ ప్రైమరీ టెస్ట్ లో భాగంగా మూడు నాలుగు ఐదు తరగతులకు, టోఫెల్ జూనియర్ టెస్ట్ లో భాగంగా 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించడం అయినది టోఫేల్ – ఈ టి ఎస్ సంస్థ పంపించిన ప్రశ్న పత్రాలను, ఆడియో క్లిప్పులను వినియోగించి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు రీడింగ్, లిజనింగ్ విభాగాలలో ఈ పరీక్షను నిర్వహించాము 21 లక్షల మంది విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహించాలని కార్యాచరణను రూపొందించగా, వారిలో 90 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్ష కు హాజరయ్యారు. 10వ తారీకు టోఫేల్ ప్రైమరీ పరీక్ష జరగగా 12వ తారీకు టోఫెల్ జూనియర్ పరీక్షను నిర్వహించారు. పాఠశాలలకు అందించిన IFP లు స్మార్ట్ టీవీల ద్వారా ఆడియో క్లిప్పులను రాష్ట్ర ఐటీ సెల్ నుంచి నేరుగా పంపించి ఈ పరీక్షను నూతన విధానంలో నిర్వహించారు . ప్రశ్నపత్రాలను ఓఎంఆర్ లను ఆయా జిల్లాల డిస్టిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డులు ప్రింట్ చేసి పాఠశాలలకు అందించాయి. ఈటిఎస్ నుంచి లిజో , ఇఫస్ నుంచి రాజీవ్ రాజ్దన్ రాష్ట్రంలో టోల్ రెడీనెస్ టెస్ట్ జరిగిన విధానాన్ని స్వయంగా పాఠశాలలకు వెళ్లి పరిశీలించి, నిర్వహణ విధానం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు విద్యార్థులతో కూడా మాట్లాడి వారి టోఫేల్ ప్రిపరేషన్ అనుభవాలను తెలుసుకున్నారు. భవిష్యత్తులో టోఫేల్ కు ప్రిపేర్ అవడానికి మరింత నూతన విధానాల్ని అవలంబించటానికి సూచిస్తామని తెలియజేశారు . రాష్ట్ర స్థాయి అధికారులు ఆర్ జేడీలు, డీఈవోలు, ఎంఈఓ లు సెక్టోరల్ ఆఫీసర్ స్ డిసిఇబిలు పలు పాఠశాలలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరుని పరిశీలించారు .విద్యార్థులు ఆన్సర్ చేసిన ఓఎంఆర్ లను ఈ టి ఎస్ సంస్థ స్కానింగ్ చేసి ఫలితాలను ప్రకటిస్తుంది. ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఈటిఎస్ సంస్థ ప్రధానం చేస్తుంది.
Prajavartha Online Telugu News