పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం మా బోళ్ళపాడు గ్రామం సిద్ధం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ పాల్గొనున్నారు. ఉయ్యూరు గ్రామంలో శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు, బూత్ కన్వీనర్లు వివిధ అనుబంధ విభాగాల సభ్యులు మరియు కార్యకర్తలతో ఏర్పాటుచేసిన జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం మా బోళ్ళపాడు గ్రామం సిద్ధం కార్యక్రమంలో పాల్గొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News