Breaking News

ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి… : పేరం శివ నాగేశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా.బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) విజయవాడ పార్లమెంటు అభ్యర్థి పేరం శివ నాగేశ్వర రావు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్ లో నిర్వహించిన అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాల్లో పేరం శివ నాగేశ్వర రావు మాట్లాడుతూ.. అంబేద్కర్ ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, మన భారత దేశంలో ఓటు హక్కు కల్పించి ఓటు ద్వారా మన ప్రజా పాలకులను మనమే నిర్ణయించుకునే అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తి అని అంబేద్కర్ అని కొనియాడుతూ అలాగే మహాత్మ జ్యోతిరావు ఫూలే కూడా బడుగు బలహీన వర్గాల జీవితాల్లో చీకటిని పారదోలి వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి అని, వీరిద్దరు భారతదేశానికి ఎనలేని గౌరవం మర్యాదలు కల్పించారని వారి కుటుంబాలను కూడా త్యాగం చేసి ప్రజల సేవకే అంకితం అయ్యారని కొనియాడారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ప్రజా సంక్షేమ దిశగా భారతదేశాన్ని తీసుకెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఓబీసీ చైర్మన్ పరాశ రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన అధ్యక్షులు జువ్వజి ఫణీంద్ర కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రెటరీ షేక్ మస్తాన్ వలీ, రాష్ట్ర నాయకులు కాపా కళ్యాణ్ కుమార్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *