తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ గా నియమితులైన అరవింద్ సాల్వే జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, సి-విజిల్ తదితరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
గురువారం పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే స్థానిక కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల మ్యాపులను పరిశీలించిన పిమ్మట ఎంసిఎంసి,ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్ కంట్రోల్ రూం, సోషల్ మీడియా మానిటరింగ్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, హెల్ప్ లైన్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు చేసే విధానం, వాటి పరిష్కార తీరును ఆరా తీయగా చేపట్టిన పలు చర్యలను మీడియా నోడల్ అధికారి మరియు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య అబ్జర్వర్ కి వివరించారు. అలాగే మీడియా లో వచ్చే ప్రతికూల వార్తలు, పిర్యాదులకు సంబందించి వివరాలను కంట్రోల్ రూం నుంచి జిల్లా ఎన్నికల అధికారి గారి సూచనల మేరకు ఎంసిసీ నోడల్ అధికారి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు పంపబడుతుందని, పిమ్మట వారు అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. సోషల్ మీడియాకు సంబంధించి ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూ ట్యూబ్ మాధ్యమాలలో వచ్చే రాజకీయపరమైన ప్రకటనలకు ఎంసిఎంసి ప్రీసర్టిఫికేషన్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై 24X7 పర్యవేక్షించి ఉల్లంఘనలపై ఎంసిసి కి పంపడం జరుగుతుందని, వారి ద్వారా నోటీస్ లు రిటర్నింగ్ అధికారి ద్వారా అందచేసి తదుపరి చర్యలు నిబందనల మేరకు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు.
అనంతరం పోలీస్ పరిశీలకులు సి-విజిల్ పర్యవేక్షక విభాగాన్ని, స్టాటిక్ సర్వేలెన్స్ టీం లు, ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం లు క్షేత్రస్థాయిలో పరిశీలనకు సంబంధించి ఆయా వాహనాలకు అమర్చిన జి. పి ఎస్ విధానం ద్వారా ఆయా వాహనాలు ఎక్కడ ఉన్నది, నిఘా బృందాల కదలికలను పరిశీలించే కంట్రోల్ రూమ్ నిర్వహణా తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా ఎన్నికల సంబంధిత ఫిర్యాదులకు తన మొబైల్ నంబర్ 9154141876 నకు ఫోన్ ద్వారా కానీ, మెయిల్ ఐడి policeobservertpt23@gmail.com ద్వారా సంప్రదించగలరని తెలిపారు.
అబ్జర్వర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకులు చంద్ర శేఖర్, సంబంధిత నోడల్ అధికారులు దశరథ రామిరెడ్డి, సతీష్, పోలీస్ అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News