Breaking News

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి కి ఘన స్వాగతం

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ తిరుపతి జిల్లాలో ఒక రోజు పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి శుక్రవారం ఉదయం 09.58 గం.లకు సతీ సమేతంగా చేరుకున్న భారత ఉప రాష్ట్రపతి కి ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్  ఘన స్వాగతం పలికారు.

అడిషనల్ డిజిపి సిఐడి సంజయ్, తిరుపతి జిల్లా ఎస్పి కృష్ణ కాంత్ పటేల్, తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జాతీయ సంస్కృత యూనివర్సిటీ ఉప కులపతి జి ఎస్ ఆర్ కృష్ణ మూర్తి, ప్రోటోకాల్ ఎస్డిసి భాస్కర్ నాయుడు తదితరులు ఉప రాష్ట్రపతి కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

అనంతరం ఉప రాష్ట్రపతి గారు 10.05 గం.లకు రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన తిరుమలకు శ్రీవారి దర్శనార్థం బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం 1.00 గంటకు జాతీయ సంస్కృత యూనివర్సిటీ చేరుకుని మూడవ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *