తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ గౌరవ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకున్న ఆయనకు, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్న ఆయన, ఆలయ మర్యాదలతో స్వామి వారిని దర్శించుకున్నారు.
కుటుంబ సమేతంగా కలియుగ ప్రత్యక్షదైవాన్ని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్న ఉపరాష్ట్రపతి, దేశ ప్రజలందరి ఆయురారోగ్యాలు, శాంతి సౌఖ్యాల కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News