Breaking News

పోలింగ్ సిబ్బంది రెండవ దఫా ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి

-ఎన్నికల పోలింగ్ విధులు కేటాయించబడిన సిబ్బంది వారికి కేటాయించబడిన నియోజక వర్గ నిర్దేశిత శిక్షణ కేంద్రంలో మే2న శిక్షణకు తప్పక హాజరు కావాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలింగ్ సిబ్బంది రెండవ దఫా ర్యాండమైజేషన్ ప్రక్రియ ఈసిఐ నిర్దేశిత వెబ్సైట్ నందు సార్వత్రిక ఎన్నికలు 2024 సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్ ఘోష్, కే.జ్యోతి సమక్షంలో మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీగా పూర్తి అయిందని, తద్వారా ఎన్నికల పోలింగ్ విధులు కేటాయించబడిన సిబ్బంది వారికి కేటాయించబడిన నియోజక వర్గ నిర్దేశిత శిక్షణ కేంద్రంలో మే2న శిక్షణకు తప్పక హాజరు కావాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు నిర్దేశిత వెబ్సైట్లో పోలింగ్ సిబ్బంది రెండవ దఫా ర్యాండమైజేషన్ ప్రక్రియ సాధారణ ఎన్నికల పరిశీలకులు మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టి పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమీషన్ వారు ఏప్రిల్ 28వ తేదీన పోలింగ్ సిబ్బంది రెండవ దఫా ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించడం జరిగిందని, ఎన్నికల కమీషన్ ర్యాండమైజేషన్ కోసం సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేయడం జరిగిందని, ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డిఈఓ లాగిన్ నుంచి ఆన్ లైన్ ద్వారా అత్యంత పారదర్శకతతో పోలింగ్ సిబ్బంది రెండవ దఫా ర్యాండమైజేషన్ ను చేపట్టామన్నారు. ఇందులో ప్రిసైడింగ్ అధికారులు 2094 మంది, సహాయ పోలింగ్ అధికారులు 2094 మంది, ఇతర పోలింగ్ సిబ్బంది 8376 మంది రిజర్వ్ తో కలిపి వెరసి మొత్తం 15936 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారని తెలిపారు. పోలింగ్ పార్టీ (1ప్రిసైడింగ్ అధికారి+5 పోలింగ్ సిబ్బంది కలిపి మొత్తం 6 మంది పోలింగ్ పార్టీ) గా ఏర్పాటు చేయడమైనది అని తెలిపారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ అసెంబ్లీ కి సంబంధించిన ఏడు నియోజకవర్గాలకు, నగరి నియోజక వర్గానికి చెందిన పుత్తూరు వడమాల పేట మండలాలకు, తిరుపతి పార్లమెంటు నియోజక వర్గానికి సంబంధించిన ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇతర పోలింగ్ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్ వివరాలను NIC సాప్ట్ వేర్ నందు ఆన్లైన్ ద్వారా చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ విధులు కేటాయించబడిన సిబ్బంది వారికి కేటాయించబడిన నియోజక వర్గ నిర్దేశిత శిక్షణ కేంద్రంలో మే2న శిక్షణకు తప్పక హాజరు కావాలని ఆదేశించారు

పోలింగ్ సిబ్బంది రెండవ దఫా ర్యాండమైజేషన్, అలాగే మైక్రో అబ్జర్వర్ ర్యాండమైజేషన్ ప్రక్రియపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి రెండవ దఫా పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్, అలాగే మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి కావడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ ఓ పెంచల కిషోర్, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ అధికారి ఎస్డిసి చంద్ర శేఖర్ నాయుడు, ఐ.టి నోడల్ అధికారి వేంకటేశ్వర రావు, తదితర అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *