తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు – 2024 నేపథ్యంలో 23- పార్లమెంటరీ నియోజకవర్గ ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ ప్రదీప్ కుమార్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎంసిఎంసి, ఈఎంఎంసి కంట్రోల్ రూం ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి పలు సూచనలు చేశారు. ఆదివారం ఉదయం 23-తిరుపతి పార్లమెంటరీ నియోజక వర్గ వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్ స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ఎంసిఎంసి, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్ కంట్రోల్ రూం, సోషల్ మీడియా మానిటరింగ్ ను పరిశీలించి లోకల్ ఛానల్ టెలివిజన్ లో ప్రసారమయ్యే కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి మీడియా లో వచ్చే ప్రతికూల వార్తలు, పిర్యాదులకు సంబందించి వివరాలతో పాటు సోషల్ మీడియాకు సంబంధించి రాజకీయపరమైన ప్రకటనలు, ఎంసిఎంసి ప్రీసర్టిఫికేషన్ కు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కె ఎస్ ఎస్ ప్రసాద్, డివిజనల్ పీ ఆర్ ఓ ఈశ్వరమ్మ, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News