Breaking News

ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కొరకు సంప్రదించండి: ఎన్నికల సాధారణ పరిశీలకులు కే. జ్యోతి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
23 – తిరుపతి (ఎస్.సి) పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 119- సర్వేపల్లి (ఎస్పీ ఎస్ ఆర్ నెల్లూరు) 120- గూడూరు (ఎస్.సి.) అసెంబ్లీ, 121– సూళ్ళురుపేట (ఎస్.సి.) అసెంబ్లీ, 122 – వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులుగా కే. జ్యోతి ఐఏఎస్ గారు కరీగౌడ ఐఏఎస్ స్థానంలో నియమితులయ్యారని వారు తిరుమల డెయిరీ సమీపంలోని ఎ5 హోటల్ రూం నంబర్ 102, ఎన్హెచ్ 5, బూదనం గ్రామం, చిల్లకూరు మండలం నందు అందుబాటులో ఉంటారని, ప్రతిరోజు ఉదయం 10 గం.ల నుండి 11 గంటల వరకు నేరుగా కలిసి ఎన్నికల సంబంధిత అంశాలపై ఫిర్యాదు చేయదలచిన వారు సంప్రదించవచ్చు అని వారు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు ఏవైనా ఉంటే నేరుగా కలవలేని వారు సెల్ నంబర్: 09912340472 ద్వారా సంప్రదించవచ్చునని వారు ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *