Breaking News

ఓటు హక్కును అందరూ తప్పక వినియోగించాలి…

-Dr.వి .మురళీకృష్ణ , స్వీప్ జిల్లా నోడల్ అధికారి 

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం (28/4/24) ఉదయం, బాబు జగ్జీవన్ రామ్ పార్క్ నందు , తిరుపతి జిల్లా స్వీప్ ఆధ్వర్యంలో వాకర్స్ కు ఓటు హక్కు వినియోగం పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో Dr.వి .మురళీకృష్ణ ,జిల్లా స్వీప్ నోడల్ అధికారి ప్రసంగిస్తూ 13/5/24 న జరిగే ఎన్నికలలో ఓటు ఉన్నవారు తప్పక పాల్గొని ఓటు వెయ్యాలని కోరారు .గత ఎన్నికల గణాంకాలు చూస్తే చదువుకున్నవారు ఎక్కువగా ఉంటె పట్టణ ప్రాంతాల్లోనే గ్రామీణ ప్రాంతాలకన్నా ఓటింగు శాతం తక్కువగా ఉన్నదని తెలియజేసారు .ఓటరు హెల్ప్ లైన్ ఆప్ ద్వారా ఓటర్లు తమ ఓటు,పోలింగ్ స్టేషన్ తదితర వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు .ప్రతిఒక్కరు ఓటు హక్కు ను వినియోగించడం ద్వారా ఓటింగ్ శాతం పెంచాలని కోరారు .పార్క్ నందు ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ నందు ఫోటో కార్యక్రమం లో ప్రజలు, యువత ఉచ్చాహంగా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *