పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ నిర్వహించారు. ఏ గడపకు వెళ్ళిన ఏ క్షణం ఎన్నికలు జరిగినా జగనన్నకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్న అక్క చెల్లెమ్మలు. అడుగడుగునా యువకుల కేరింతలతో ముందుకు పర్యటన సాగింది. ఆదివారం కంకిపాడు మండలంలోని పునాదిపాడు గ్రామం నందు గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహిస్తూ, ప్రజలతో మమేకమవుతూ, పట్టణంలో ఉన్న ప్రతి సమస్యకు అతి త్వరలో పరిష్కారం చూపుతామని హామీ జోగి రమేష్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు పెద్ద ఎత్తున యువకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News