రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి రూరల్ నియోజక వర్గానికి చెందిన 2,72,826 మంది ఓటర్లకు ఓటరు గుర్తింపు స్లిప్స్ ను పంపిణీ చేయడం జరుగుతోందని జాయింట్ కలెక్టర్, రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీ ఎల్ వో లకి ఓటర్ స్లిప్స్ నీ అందచేశారు. ఈ సందర్భంగా ఆర్వో తేజ్ భరత్ మాట్లాడుతూ, ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కునేందుకు వారు ఓటు హక్కును కలిగి ఉన్నారని నిర్ధారణ, పొలింగ్ కేంద్రాల వివరాలు తెలియ చెయ్యడం , అందుకు నిర్దారణ ప్రక్రియ లో ఓటరు స్లీప్ జారీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. రూరల్ నియోజక వర్గంలో 2,72, 826 మంది ఓటర్లు కు ఓటరు గుర్తింపు స్లిప్స్ అందజేసేందుకు 267 మంది బి ఎల్ వో లు ఇంటింటికీ తిరిగి వారికీ ఓటర్ స్లిప్స్ అందచేసి, సంతకాలు తీసుకోవాలన్నారు. మే 13 వ తేదీన తప్పకుండా పోలింగ్ కేంద్రానికి వొచ్చి ఓటు హక్కును వేయ్యాలనీ చైతన్యం తీసుకుని రావాలని కోరారు. ఓటరు స్లీప్ ద్వారా ఓటు హక్కును వేసేందుకు అవకాశం లేదనీ, ఎపిక్ కార్డు లేదా ఎన్నికల కమిషన్ గుర్తించిన ఫోటో ఆధారిత గుర్తింపు కార్డు తప్పని సరి అని తెలియ చేశారు.
ఈ సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారులు ఐ. సాయి బాబా, కొండయ్య, వై వి కే అప్పారావు, బి. రమాదేవి, బి ఎల్ వో లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News