విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు నరేందర్ సింగ్ బాలి గురువారం మైలవరం నియోజవర్గానికి సంబంధించిన ఈవీఎం, వివి ప్యాట్ కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం ఈవీఎంల రెండో దశ ర్యాండమేషన్ ప్రకారం క్రమ పద్ధతిలో మ్యాచింగ్ చేసిన బ్యాచింగులను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వివి ప్యాట్ లను వీడియోగ్రఫీ ద్వారా తెరిచి ఈవీఎంలను బెల్ ఇంజనీర్లతో కమిషనింగ్ చేశారు. నందిగామ నియోజకవర్గానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రమైన కెవిఆర్ కళాశాల వద్ద నిర్వహించిన ఈ ప్రక్రియను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ముందు రిటర్నింగ్ అధికారి ఏ రవీందర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కమిషనింగ్ విధానాన్ని సాధారణ ఎన్నికల పరిశీలకులు నరేంద్ర సింగ్ బాలి పరిశీలించారు. నందిగామ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలలో ఈ నెల13 వ తేదీన పోలింగ్ జరగనున్న దృష్ట్యా ఓటర్లకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులు ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ర్యాంపులు, తగినంత వెలుతురు, త్రాగునీరు, విద్యుత్,మరుగుదొడ్లు, ఎండ తీవ్రత దృష్ట్యా ,అవసరమైన చోట షామియానా వంటి సౌకర్యాలు కల్పించాలని పరిశీలకులు నరేంద్ర సింగ్ బాలి అన్నారు.
Prajavartha Online Telugu News