Breaking News

ప్రజా సమస్యలపై పోరాటం చేసి పరిష్కారానికి కృషి చేస్తా… : జోగి రమేష్

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పెనమలూరు మండలం పెదపులి పాక గ్రామంలో గురువారం రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ విస్తృతంగా పర్యటించారు. జోగి పర్యటనలో కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకే తమ ఓటు వేస్తామని తెలిపారు.  రాష్ట్రంలో సంక్షేమ పథకాల అభివృద్ధి జరగాలన్నా పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే  వైసీపీ ప్రభుత్వం రావాలని కాబట్టి తమని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటరు పై ఉందని పెనమలూరు ఓటర్లను జోగి రమేష్ అభ్యర్ధించారు.చంద్రబాబు నాయుడు మాయ మాటలు, బోడే ప్రసాద్ మాటలు వారి అహంకారానికి తగిన గుణపాటం చెబుతా మని పెదపులిపాక ఓటర్లు తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ ప్ర భుత్వం ఏర్పడిన తర్వాత రాబోయే 5 సంవత్సరాల కాలంలో తన కర్తవ్యంగా ప్రజా సమస్యలపై తాను పోరాటం చేసి పరిష్కరించే మార్గంగా తాను ప్రతి ఒక్క కుటుం బంలొ ఒక సభ్యునిగా ఉంటానని హామి ఇచ్చారు. వైసీపీ నాయకులు ఈడె చాముండేశ్వరి, కోసూరు నరేష్, కుమార్ లింగాల శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై సీఎం సానుకూలం : మంత్రి నారాయణ

-సీఆర్‌డీఏ కమిషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శితో వెంటనే మాట్లాడుతా : నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *