Breaking News

సీఎం జగన్ పాలనలో రహదారులకు మహర్దశ

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆశించిన దాని కంటే సెంట్రల్ నియోజకవర్గం మెరుగైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మధురానగర్ ఆర్.యు.బి. వద్ద కూటమి నేతలకు సోమవారం ఆయన సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిధులు, 14 వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం, వీఎంసీ జనరల్ ఫండ్స్.. ఇలా పెద్దఎత్తున నిధులు కేటాయిస్తూ ప్రజావసరాలను తీరుస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ప్రధానంగా రోడ్లపై దృష్టి సారిస్తూ.. రహదారులను ఎప్పటికప్పుడు ఆధునికీకరించినట్లు వెల్లడించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో అక్షరాల రూ. 200 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జిని రూ. 22 కోట్లతో పూర్తిచేసి.. ఈ ప్రాంత ప్రజల కల సాకారం చేసినట్లు తెలిపారు. మరో రూ. కోటి నిధులతో మధురానగర్ సాయిబాబా గుడి నుంచి రైల్వే గేట్ వరకు రహదారిని ఆధునికీకరించినట్లు చెప్పారు. రూ. 5 కోట్ల నిధులతో పైపుల రోడ్డు జంక్షన్ నుంచి జక్కంపూడి జంక్షన్ వరకు 5.3 కి.మీ. మేర బీటీ రోడ్డును నిర్మించగా.. కండ్రిక జంక్షన్ నుంచి ముస్తాబాద్ జంక్షన్ వరకు రూ. 4 కోట్లతో 4.2 కి.మీ. మేర బీటీ రోడ్డును నిర్మించినట్లు చెప్పారు. రూ.3.50 కోట్ల DMFT ఫండ్ తో కండ్రిక నుంచి పాతపాడు వరకు 3 కి.మీ. మేర నూతన రహదారిని ప్రారంభించుకున్నట్లు తెలిపారు. రూ. 2.50 కోట్ల నిధులతో చేపట్టిన విజయవాడ – నూజివీడు రహదారి నియోజకవర్గానికే మణిహారంగా మారిందన్నారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంత ప్రజలు రాకపోకలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా.. ఆర్.యు.బి.ని సైతం పునరుద్ధరించుకున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. రామకృష్ణాపురం నుంచి దేవీనగర్ వరకు ప్రధాన రహదారిని అనతికాలంలోనే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. చంద్రబాబు హయాంలో చెరువులను తలపించిన లోటస్ ప్రాంతాన్ని.. రూ. 6 కోట్ల నిధులతో మోడల్ ప్రాంతంగా తీర్చిదద్దడం జరిగిందన్నారు. లోటస్ ప్రధాన గేటు నుంచి రాజరాజేశ్వరిపేట కట్ట రోడ్డు వరకు అయోధ్యనగర్ ప్రధాన రహదారిని రూ. 20 లక్షల వీఎంసీ సాధారణ నిధులతో పునరుద్ధరించడంతో వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరంగా మారిందన్నారు. సత్యనారాయణపురంలో నూతన రహదారుల నిర్మాణంతో ఆ ప్రాంత ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. సింగ్ నగర్ గంగానమ్మ గుడి నుంచి రైల్వే ట్రాక్ వరకు రూ. 88.95 లక్షల నిధులతో డ్రెయిన్ టూ డ్రెయిన్ బీటీ రోడ్డు నిర్మించినట్లు తెలిపారు. రూ. 90 లక్షల 14వ ఆర్థిక సంఘం నిధులతో తోటవారి వీధి ప్రధాన రహదారిని నిర్మించుకోవడంతో పాటు రూ. 2 కోట్లతో తోటవారి వీధిలోని అంతర్గత రహదారులను పూర్తి చేయడం జరిగిందన్నారు. EWS కాలనీలో రూ. 1.50 కోట్లతో రహదారులు నిర్మించుకోగా.. రూ. 80 లక్షలతో LIG – 1, 2., MIG – 1 కాలనీలలో రోడ్లు నిర్మించినట్లు చెప్పారు. LIG -2 లో మరో రూ. 50 లక్షల నిధులతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. అనుమానం ఉంటే పనులు పరిశీలించుకోవచ్చన్నారు. రూ. 69 లక్షలతో వాంబేకాలనీ హెచ్ బ్లాక్ లో రహదారులు, రూ.93 లక్షలతో ప్రశాంతి నగర్లో నూతన రోడ్లను నిర్మించుకున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. రూ.1.20 కోట్ల వ్యయంతో డాక్టర్స్ కాలనీ రోడ్లను పూర్తిచేసుకున్నట్లు వివరించారు. ఎలక్ట్రిసిటీ కాలనీలో రూ. 30 లక్షలు, ప్రగతినగర్లో రూ. 40 లక్షలతో సిమెంట్ రోడ్లను నిర్మించుకున్నట్లు పేర్కొన్నారు. దాబాకొట్లు ఎక్సెల్ ప్లాంట్ రోడ్డు జంక్షన్ నుంచి వాంబే కాలనీ డిస్నీల్యాండ్ రోడ్డు వరకు రూ. 3 కోట్లతో నూతన రహదారిని నిర్మించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. జీవీఆర్ నగర్, వినాయక్ నగర్, దావుబుచ్చయ్య కాలనీలలో రూ. 9 కోట్ల నిధులతో రహదారుల పనులు పూర్తిచేసినట్లు వెల్లడించారు. గుణదల సంగం రోడ్డును వినియోగంలోకి తీసుకువచ్చామన్నారు. అలాగే 96 వార్డు సచివాలయాల పరిధిలో విడుదలైన రూ. 19.20 కోట్ల గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో.. 21 డివిజన్లలోని అనేక రహదారులు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయన్నారు. ఇలా 95 శాతానికి పైగా పనులు పూర్తి చేసి.. ప్రజావసరాలను తీర్చినట్లు మల్లాది విష్ణు తెలియజేశారు. అలాగే సెంట్రల్ ప్రాంతంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత పటిష్ట పరిచేలా.. ఒక నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను సైతం ప్రారంభించుకున్నట్లు తెలిపారు. కనుకనే రాష్ట్రంలో మేటిగా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పుకొచ్చారు.

బహిరంగ చర్చకు సిద్ధమా..?
రహదారుల గూర్చి మాట్లాడే నైతిక అర్హత కూటమి నేతలు, పచ్చ పత్రికలకు ఏమాత్రం లేదని మల్లాది విష్ణు విమర్శించారు. ధైర్యముంటే ఎవరి హయాంలో రోడ్ల నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారులకు కలిపి రూ. 23,792.19 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ఏకంగా రూ. 46,383.20 కోట్లు వెచ్చించినట్లు తెలియజేశారు. రోడ్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనమన్నారు. పైగా చంద్రబాబు హయాంలో రోడ్ల నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన రూ.3,800 కోట్ల రుణాలను ఇతర అవసరాలకు మళ్లించారని.. పసుపు-కుంకుమ పేరిట పప్పు బెల్లంలా ఖర్చు పెట్టినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. కనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలను కూటమి నేతలు మానుకోవాలని.. ప్రజావసరాలను గుర్తించి పరిష్కరించడంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరెవరూ సాటిరారని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ లను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *