Breaking News

ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమక్షంలో వైసీపీలోకి భారీ చేరికలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పరిపాలనకు అన్నివర్గాల ప్రజల నుంచి ఆమోదం లభిస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 23వ డివిజన్లో సోమవారం 40 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరాయి. వీరికి మల్లాది విష్ణు పార్టీ కండువా క‌ప్పి వైసీపీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై, ఆయన పాలనాదక్షతపై నమ్మకంతో పెద్దసంఖ్యలో నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభపరిణామని మల్లాది విష్ణు అన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు పూర్తి సంతృప్తికరంగా ఉన్నారనడానికి ఇదొక నిదర్శనమన్నారు. అంకితభావంతో పనిచేస్తూ.. క్రమశిక్షణతో మెలిగే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాల సాధన కోసం పనిచేసి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు వెలంపల్లి రాఘవ, ఆత్మకూరు సుబ్బారావు, ఒగ్గు విక్కీ, చల్లా సుధాకర్, శేషన్ మురళి, వెన్నం రత్నారావు, శివారెడ్డి, పసుమర్తి రాజేష్, రామ్ పీఎస్ఆర్, పండు, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *