Breaking News

ఆటో డ్రైవర్ల సంక్షేమంపై పచ్చ మీడియా విష ప్రచారం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆటో డ్రైవర్ల సంక్షేమంపై పచ్చ మీడియా పనిగట్టుకుని విషం చిమ్ముతోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. గుణదలలో బుధవారం ఎన్నికల ప్రచార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత వాహనం ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం అందిస్తోన్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయినా పిచ్చి రాతలతో పచ్చ పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం గత ఐదేళ్ల పాలనలో ఫైన్ల రూపంలో ఆటో డ్రైవర్ల నుంచి దాదాపు రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు వసూలు చేసి నడ్డి విరిచిందని గుర్తుచేశారు. అటువంటి ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలు, బాధలు స్వయంగా పాదయాత్ర ద్వారా గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. వారిని ఆదుకునేందుకు వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని రూపొందించారని వెల్లడించారు. 2018 మే 14న ఏలూరులో తనను కలిసిన ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. వాహనమిత్ర ద్వారా నియోజకవర్గంలో 2019–20 ఏడాదిలో 1,835 మందికి రూ. 1.83 కోట్లు., 2020–21 ఏడాదిలో 1,816 మందికి రూ.1.81 కోట్లు., 2021–22 లో 1,815 మందికి రూ. 1.81 కోట్లు., 2022-23 లో 1,825 మందికి రూ.1.82 కోట్ల మేర లబ్ధి చేకూరిందని మల్లాది విష్ణు అన్నారు. మొత్తంగా ఐదేళ్లలో దాదాపు రూ. 10 కోట్ల ఆర్థిక సాయాన్ని సెంట్రల్ పరిధిలో అందజేసినట్లు తెలిపారు. వీరిలో దాదాపు 84 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు సంబంధించిన వారే ఉన్నట్లు వివరించారు. కరోనాతో రెండేళ్లు ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా.. పేదలైన డ్రైవర్లను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం పథకాన్ని కొనసాగించిందని మల్లాది విష్ణు వెల్లడించారు. వాహన నిర్వహణ, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఫిట్ నెస్ ఫీజులను చెల్లించేందుకు ఈ ఆర్థిక సాయం ఎంతగానో ఉపయోగపడుతోందని ఆటో డ్రైవర్లందరూ ముక్తకంఠంతో చెబుతున్నారని.. కనుక తప్పుడు ప్రచారాలను మానుకోవలసిందిగా సూచించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. ఈ ఎన్నికలలో 175 స్థానాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మ్రోగించడం ఖాయమని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *