తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నాల్గవ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను న్యూ ఢిల్లీ నిర్వాచన్ సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాలుగో దశ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘంచే నియమించబడిన సాధారణ, పోలీస్, వ్యయ సెంట్రల్ అబ్జర్వర్లు, స్పెషల్ అబ్జర్వర్లకు దిశా నిర్దేశాన్ని చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు ఉజ్వల్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు జ్యోతి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ వ్యయ పరిశీలకులు ప్రదీప్ కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు విజి శేషాద్రి, మీను ఓలా, తిరుపతి పార్లమెంటరీ పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News