తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలోని 7-అసెంబ్లీ స్థానాలలో మరియు ఇతర జిల్లా ఓటర్ల కొరకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) ఫెసిలిటేషన్ కేంద్రాలు రేపు గురువారం 9మే మధ్యాహ్నం వరకు నిర్వహించబడునని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర జిల్లాలో ఓటు కలిగి, తిరుపతి జిల్లాలో పనిచేస్తూ, 26 ఏప్రిల్ లోపు తిరుపతి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు సమర్పించిన వారు రేపు గురువారం మే9 న మధ్యాహ్నం వరకు తిరుపతి SVU క్యాంపస్ హైస్కూల్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోగలరని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Tags tirupathi
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News