Breaking News

జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు

-ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహామ్మద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాయా కూటమి పరాజయం తప్పదని మళ్ళి ముఖ్యమంత్రి గా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఖయమని ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ అన్నారు. శనివారం గాంధీ నగరంలోని హోటల్ ఐలాపురంలో ఈరోజు ముస్లిం జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆర్యవైశ్య నగరాల కాపు క్రిస్టియన్ మైనార్టీ సంఘాల మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ 13వ తేదీన జరిగే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కీలకమైనవని కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు ఆపటం ఎవరి తరం కాదన్నారు ప్రతి ఒక్కరు వైసీపీని ఎందుకు గెలిపించుకోవాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ పేదవారికి బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలతో పాటు సామాజిక రాజకీయ న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి వెనుక ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు యోనా రాజు ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్స్ జేఏసీ కన్వీనర్ రాబర్ట్ సునీల్ ఎమ్మార్పీఎస్ జేఏసీ కన్వీనర్ మేదర సురేష్ బాబు. బాబు జగజీవన్ రావు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శబరి
అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. పాతూరి సతీష్, ఆర్యవైశ్య సంఘం నగర అధ్యక్షుడు.. రాఘవ, రాష్ట్ర నగరాల సంఘం ప్రతినిధి.. భాస్కర్, ముస్లిం అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ ఖలీల్ అహ్మద్ ఆటోనగర్ టెక్నీషియన్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *