విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు హక్కును అందరూ వినియోగించుకొని భాగస్వాములు కావాలని గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు ఆర్.ఆర్.గాంధీ నాగరాజన్ (నేటి గాంధీ) ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని పలు కూడలి ప్రాంతాలలో తన ప్రచార రథంతో ఓటర్ల అవగాహన ప్రచారం కార్యక్రమాన్నినిర్వహించారు. తెరిచి వుంచిన మద్యం దుఖానాలు మూసివేయాలని, మద్యపానం నిషేధం విధించాలని ఎన్నికల కమిషనర్ కి వినతులు పంపాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎవరు ముందుకు వస్తారో వారికే ఓటు వెయ్యాలన్నారు. ఓటు అనేది శక్తివంతమైన ఆయుధమని దానిని సరైన వ్యక్తి ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎపి అధ్యక్షురాలు బంగారు భారతి, ట్రస్ట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Prajavartha Online Telugu News