Breaking News

చంద్రబాబుపై ఈసీకి వైసీపీ బృందం ఫిర్యాదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న దిగజారుడు విమర్శలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ బృందం కోరింది. ఈ మేరకు శనివారం వెలగపూడి సచివాలయం నందు సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ముగిసే వరకు చంద్రబాబు వాడిన భాష జుగుప్సాకరమని మల్లాది విష్ణు అన్నారు. సంస్కార హీనంగా బహిరంగ సభలలో ఆయన మాట్లాడిన మాటలను ప్రతిఒక్కరూ అసహ్యించుకుంటున్నారన్నారు. తాజాగా విశాఖపట్నం, ఒంగోలు, ఉండి, ఏలూరు బహిరంగ సభలలోనూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆయన మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదును అందజేసినట్లు తెలిపారు. అలాగే పల్నాడు, ప్రకాశం, ఏలూరు జిల్లాల వైసీపీ అభ్యర్థులపై చెడుగా కథనాలు ప్రచురించిన ఎల్లోమీడియా(ఈనాడు)పైనా ఈసీకి ఫిర్యాదును అందించడం జరిగిందన్నారు. వీటన్నింటినీ తెలుగుదేశం పెయిడ్ వార్తలుగా పరిగణించవలసిందిగా ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. ఓటమి భయంతో ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రిపైన కూటమి నేతలు ముప్పేట దాడి చేస్తున్నారని.. ఈ నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కనుమరుగు కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, వైసీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *