Breaking News

జిల్లాలో అమలయ్యే వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలు ప్రతి వారం సమీక్షిస్తాం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అమలయ్యే వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలు ప్రతి వారం సమీక్షిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టర్ సమావేశం నిర్వహించి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, పి హెచ్ సి ల పనితీరు, ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. తొలుత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జే గీతా బాయి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు 49 పి హెచ్ సి లు, మచిలీపట్నంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, గుడివాడలో ఏరియా ఆసుపత్రి, 13 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, గ్రామాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు వాటిల్లో పని చేసే వైద్యులు, సిబ్బంది, ఖాళీల వివరాలు కలెక్టర్కు వివరించారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు వాటి ప్రగతి గురించి కలెక్టర్ ఆరా తీశారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలయ్యాక వైద్య ఆరోగ్యశాఖ వాటి అనుబంధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలపై క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రతిరోజు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించాలని సంబంధిత వైద్యాధికారులకు సూచిస్తూ, తాను ప్రతి వారం వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షిస్తానని అన్నారు. ముఖ్యంగా వైద్య సిబ్బంది క్యాడర్ వారీగా నిర్వర్తించాల్సిన విధులు, వారి పరిధిలో పారామీటర్లు వాటికి సంబంధించిన మొబైల్ యాప్, సాధించాల్సిన ప్రగతి గురించి జూన్ 18 న సమావేశం నిర్వహించి సమీక్షిస్తామన్నారు. ఈలోగా ఆయా సిబ్బంది కేడర్ వారీగా జాబ్ చార్టులు, వారికి నిర్దేశించిన విధుల గురించి ప్రణాళిక రూపొందించి పి పి టి సిద్ధం చేయాలని డి ఎం అండ్ హెచ్ ఓ ను ఆదేశించారు. ఏవైనా కోర్టు కేసులు ఉంటే కోర్టు ధిక్కరణకు అవకాశం లేకుండా ఎలాంటి ఆలస్యం కాకుండా సకాలంలో కౌంటర్లు వేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సతీష్, టి బి, మలేరియా తదితర వైద్య విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *