మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 22వ తేదీ నుండి అగ్ని వీర్ వాయు (సంగీతకారుడు) కోసం భారతీయ వైమానిక దళం రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆసక్తి కల అవివాహితులైన స్త్రీ పురుషులు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నిపద్ పథకం కింద కాన్పూర్ లోని 3 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్, బెంగళూరులోని 7 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ లలో అగ్నివీర్ వాయు (సంగీతకారుడు) రిక్రూట్మెంట్ ర్యాలీ ఈ నెల 22వ తేదీ నుండి వచ్చే జూన్ నెల 5వ తేదీ వరకు నిర్వహిస్తోందని కలెక్టర్ వివరించారు. ఈనెల 22వ తేదీ ఉదయం 11 గంటల నుండి హెచ్ టి టి పి ఎస్://అగ్నిపత్ వాయు డాట్ సిడిఏసి డాట్ ఇన్ (https://agnipathvayu.cdac.in) వెబ్ పోర్టల్ లో ఆసక్తిగల 10 వ తరగతి ఉత్తీర్ణులైన అవివాహిత స్త్రీ పురుషులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకోసం సికింద్రాబాద్ లోని భారతీయ వైమానిక దళం సెలక్షన్ సెంటర్ వింగ్ కమాండర్ కమాండింగ్ అధికారి గురుప్రీత్ అత్వాల్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఇతర వివరాలకు నోటిఫికేషన్, వెబ్ పోర్టల్ ను పరిశీలించాలన్నారు.
Prajavartha Online Telugu News