Breaking News

నేరచరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులను కౌంటింగ్ ప్రాగణంలోకి అనుమతించకూడదు… : నేతి మహేశ్వర రావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ ఆధ్వర్యంలో న విజయవాడ ప్రెస్ క్లబ్ లో పారదర్శక ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వ ఒత్తిళ్లు కు గురిఅవుతున్న అధికారులను దూరంగా ఉంచాలని అలాగే నేరచరిత్ర ఉన్న ప్రజాప్రతినిధులను కౌంటింగ్ ప్రాగణంలోకి అనుమతించకూడదు అన్న అంశం మీద మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షుడు నేతి మహేశ్వర రావు మాట్లాడటం జరిగింది.

నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే పారదర్శక ఎన్నికల ప్రక్రియ ఉండాలి అలాంటి ప్రక్రియలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగని నిబద్దత తో కూడిన అధికారుల పాత్ర ముఖ్యం మరి అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా అన్న అంశం మీద చర్చజరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ కోరుకొంటుంది అన్నారు.

ప్రస్తుత చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న AP State Department’s Corporation ద్వారా ~24500 కోట్లు అప్పులు తెచ్చి లెక్కలు ఆడిట్ లు 2020 నుంచి చేయని పరిస్థితి మీద ప్రతి సంవత్సరం CAG నివేదికలు ఇస్తున్న కూడా స్పందన లేని పరిస్థితి అంటే అర్ధం ఒక ఉన్నత స్థానంలో ఉండికూడా చట్టబద్దం గ కంపెనీ చట్టాల ప్రకారం అలాగే అప్పులు ఇచ్చిన బ్యాంకుల ఒప్పందాల ప్రకారం నడుచుకోవాల్సిన అధికారి మీద ప్రస్తుత ప్రభుత్వ ఒత్తిడి ఎంతఉందో అర్ధమవుతుంది అన్నారు.

ఎన్నికల ప్రక్రియలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి బూతు స్థాయిలో కెమెరాలు పెట్టి పరిశీలించే పరిస్థితిలో ఒక ప్రజాప్రతినిధి ఈవీఎం లను పగలగొట్టినా కూడా అనుమానాస్పద వ్యక్తులు పగలగొట్టారు అన్న వాదన అధికారులనుంచి వచ్చింది అంటే అర్ధం ప్రస్తుత అధికారుల మీద ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఎలాఉందో అన్న సంగతి ప్రతిఒక్కరికి అర్ధం అవుతుంది అని మేము చెప్పదలుచుకొన్నాను

తీవ్ర రాజకీయ ఒత్తిళ్ళ వాతావరణంలో ఉన్న అధికారులు ఆధ్వర్యంలో జూన్ 4 న జరగబోయే కౌంటింగ్ సజావుగా జరుగుతుందా అన్న అనుమానం ప్రతిఒక్కరిలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ నిష్పక్షపాత కౌంటింగ్ ప్రక్రియ కోసం రాజకీయ ఒత్తిళ్లు అలాగే ఆరోపణలను ఎదుర్కొంటున్న అధికారులను కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణ నుంచి తప్పించవలసిందిగా ఎన్నికల కమిషన్ ని కోరుచున్నాము

ఎన్నికల్లో కందుకూరు అసెంబ్లీ స్వతంత్ర అబ్యర్థిగా పోటీచేసిన మేము గమనించినిది ఎన్నికల ఏజెంట్ లను పెట్టడానికి నేరచరిత్ర చూసి పెట్టాలి అన్న గొప్ప ఎన్నికల విధానం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా ఈవీఎం లను పగులగొట్టిన ప్రతినిధులు, నేరచరిత్ర ఉన్న ప్రతినిధులను ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఇస్తే అక్కడున్న ఎన్నికల అధికారులు భయంలేకుండా నిస్పక్షపాతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేసే పరిస్థితులు ఉంటాయా అన్న అనుమానం ప్రతిఒక్క పౌరుడికి ఉందని తెలియజేస్తున్నాము.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో దాడి ప్రతిదాడి లాంటి యుద్దాన్ని తలపించే వాతావరణం లో నేరచరిత్ర ఉన్న వ్యక్తి ని అలాగే ఈవీఎం లను పగలగొట్టే మనస్తత్వం ఉన్న ప్రజాప్రతినిధులను కౌంటింగ్ ప్రాగణంలోకి అనుమతి ఇస్తే జరగబోయే పరిస్థితులను ఎవరు నియంత్రించగలరు అని అడుగుతున్నాము

Model Code Of Conduct as Per Election Commission నిబంధల ప్రకారం ఎన్నికల్లో పోటీచేసిన అబ్యర్ధి నియమ నిబంధనలను ఉల్లంఘించడం అలాగే ఈవీఎం లను పగలగొట్టడం లాంటి చర్యలను తీవ్రంగా తీసుకొని భవిష్యత్తులో ఆయా పార్టీల ప్రతినిధులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండటానికి అలాంటి ప్రజాప్రతినిధులను శాస్వితంగా ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేకుండా చేయవలసిందిగా ఎన్నికల కమిషన్ ని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ఫోరమ్ సభ్యులు జొన్నల గడ్డ శ్రీనివాసరావు అలాగే బొప్పన రాజశేఖర్ రావు పాల్గొనడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *