-పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై ఆర్వోలు, అడిషనల్ ఆర్వోలు మరింత అవగాహన కలిగి ఉండాలి : జాయింట్ కలెక్టర్ హెచ్ఎం ధ్యాన చంద్ర
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా.. పక్కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రంలో హాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఎ ఆర్ ఓ లు, అడిషనల్ ఎ ఆర్ ఓ లకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఓట్ల లెక్కింపు పై శిక్షణ ఇస్తూ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… సార్వత్రిక ఎన్నికలు -2024 ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆర్వోలు, అడిషనల్ ఆర్ ఓ లు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు గురించి హ్యాండ్ బుక్ ను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకుని కౌంటింగ్ నిర్వహణ ను సమర్థవంతంగా నిర్వహించేలా చూడాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ 8 గంటలకు లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుందని పోస్టల్ బ్యాలెట్స్ 25 ఓట్లు చొప్పున కట్టలు కట్టాలని ప్రతి టేబుల్ కు 500 ఓట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు రౌండ్ వారీ ఫలితాలు మీడియా సెంటర్ కు అందజేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితిసింగ్, తిరుపతి శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు రిటర్నింగ్ అధికారులు నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, చంద్రముని, కిరణ్ కుమార్, ట్రైనింగ్ నోడల్ అధికారి రామ్మోహన్ పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి సుశీల దేవి, నియోజకవర్గ ఆర్వోలు, అడిషనల్ ఆర్వోలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News