Breaking News

ప్రశాంతమైన వాతావరణం లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యం

-ఓట్ల లెక్కింపు వేళ‌… విజ‌యోత్స‌వ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వ‌హించ‌రాదు
-ఎన్నికల కౌంటింగ్ కొరకు ఏర్పాట్లు పూర్తి సన్నద్ధం
-కౌంటింగ్ ఒకసారి ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు వెళ్లడయ్యేవరకు ప్రక్రియ ఆగరాదు
-జిల్లాలో 144 సెక్ష‌న్ అమల్లో ఉంది:కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
-కౌంటింగ్ కు పటిష్టమైన భద్రత చర్యలు చేపడుతున్నాం: ఎస్పీ హర్ష వర్ధన్ రాజు

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 04వ తేదీన జిల్లాలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ జరుగుతుంద‌ని, ఈ మేర‌కు జిల్లా యంత్రాంగం త‌ర‌ఫున శ్రీపద్మావతి మహిళా విశ్వ విద్యాలయాల ఇంజనీరింగ్ క‌ళాశాల‌లో దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సదరు లెక్కింపు కేంద్రాల్లో ప‌టిష్ట ఏర్పాట్లు చేశామ‌ని, ఆ రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు ఉండరాదనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదనీ, ఓట్ల లెక్కింపు వేళ‌ విజ‌యోత్స‌వ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వ‌హించ‌రాదనీ, జిల్లాలో అమ‌ల్లో 144 సెక్ష‌న్ అమలు ఉందని, బాణాసంచా విక్రయం, పేల్చడం నిషేధం అని, ప్రశాంత వాతావరణం లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ మరియు ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సంయుక్తంగా పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎస్పీ తో కలిసి సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్4 న ఎన్నికల ఓట్ల లెక్కింపు మరియు ఫ‌లితాల వెల్ల‌డి నేప‌థ్యంలో జిల్లాలో శాంతి భద్రతలు పక్కాగా అమలు పరచే దిశలో జిల్లాలో సెక్షన్ 144 అమలులో ఉందని, పోలింగ్ సమయంలో మరియు పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసు శాఖ పలు చర్యలు చేపట్టిందని తెలుపుతూ నేటితో దేశంలోని అన్ని దశల పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి అని, ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గ పిసి మరియు పోస్టల్ బ్యాలెట్ రెండు మొత్తం కలిపి 16 కౌంటింగ్ హాల్ నందు జరిగే ప్రతిది సీసీటీవీ కెమెరా నందు రికార్డ్ అవుతుందని, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలని ఎలాంటి గొడవలకు తావివ్వరాదని లేనిచో సదరు కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీస్ ఏర్పాటు ఉంటుందని వారు వారికి సంబంధించిన పోలీస్ సిబ్బంది టీమ్ తో తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ ఒకసారి ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితాలు వెళ్లడయ్యేవరకు ప్రక్రియ ఆగరాదని తెలిపారు. మీడియా కేంద్రం ఏర్పాటు చేశామని, అందు కొరకు కౌంటింగ్ అథారిటీ లెటర్లు ఉన్నవారిని, ఓబి వ్యాన్ లను గేట్ వన్ నుండి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, సంబంధిత రిటర్నింగ్ అధికారి జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఐడీ పాస్ ఉన్న వ్యక్తులు మాత్రమే ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుందని, కౌంటింగ్ కేంద్రం లోప‌ల‌కు అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బందికి మొబైల్ ఫోన్ తీసుకెళ్లడానికి వీలులేదని తెలిపారు. కౌంటింగ్ ప్రాంగణంలోకి ఇతర వాహనాల‌కు అనుమ‌తి లేదని తెలిపారు.

ఉదయం 8 గం.లకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం అవుతుందని, ఉదయం 8.30 గం. లకు ఈవిఎం కంట్రోల్ యూనిట్ నందు ఓట్ల లెక్కింపు ప్రారంభం ఐతుందనీ అన్నారు. స్ట్రాంగ్ రూం ఉదయం 7 గం.లకు అబ్జర్వర్లు, అభ్యర్థులు, ఏజెంట్లు సమక్షంలో తెరచి సంబంధిత కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. మొదటి రెండు రౌండ్లు దాదాపు 30 ని. లు సమయం పడుతుందని, తర్వాత 20 నిమిషాలకు తగ్గుతుందని తెలిపారు. తిరుపతి పార్లమెంట్ కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ మొత్తం 14 టేబుల్ లు, 3 రౌండ్లలో పూర్తి అయ్యేలా సాయంత్రం 4గం. ల కల్లా ఫలితాలు వెళ్ళడించెలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.120- గూడూరు కు సంబంధించి 294 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 14, అసెంబ్లీ కొరకు 14 టేబుల్ లు ఏర్పాటుతో 21 రౌండ్లు సుమారు సాయంత్రం 3.50 గం.లకు ఫలితాలు ప్రకటించేలా, 121- సూళ్లూరుపేట కు సంబంధించి 304 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 14, అసెంబ్లీ కొరకు 14 టేబుల్ లు ఏర్పాటుతో 22 రౌండ్లు సుమారు సాయంత్రం 4.10 గం. లకు ఫలితాలు ప్రకటించేలా, 122- వెంకటగిరి కి సంబంధించి 299 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 14, అసెంబ్లీ కొరకు 14 టేబుల్ లు ఏర్పాటుతో 22 రౌండ్లు సుమారు సాయంత్రం 4.10 గం.ల వరకు ఫలితాలు ప్రకటించేలా, 167- తిరుపతి కి సంబంధించి 274 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 14, అసెంబ్లీ కొరకు 14 టేబుల్ లు ఏర్పాటుతో 20 రౌండ్లు సుమారు సాయంత్రం 3.30 గం.ల వరకు ఫలితాలు ప్రకటించేలా, 168- శ్రీకాళహస్తి కి సంబంధించి 293 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 14, అసెంబ్లీ కొరకు 14 టేబుల్ లు ఏర్పాటుతో 21 రౌండ్లు సుమారు సాయంత్రం 3.50 గం.ల వరకు ఫలితాలు ప్రకటించేలా, 169- సత్యవేడు కి సంబంధించి 279 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 14, అసెంబ్లీ కొరకు 14 టేబుల్ లు ఏర్పాటుతో 20 రౌండ్లు సుమారు సాయంత్రం 3.30 గం.ల వరకు ఫలితాలు ప్రకటించేలా,చిత్తూరు పార్లమెంట్ నియోజక వర్గ 166-చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించి 397 పోలింగ్ కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పిసి కొరకు 20 అసెంబ్లీ కొరకు 20 టేబుల్ లు ఏర్పాటుతో 20 రౌండ్లు సుమారు సాయంత్రం 3.30 గం.ల వరకు ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రతి రౌండ్ సరాసరి 3 గం.లు పడుతుందని ఏడు నియోజక వర్గాలకు సంబంధించి 22795 పోస్టల్ బ్యాలెట్ మరియు ఈటిపీబి కలిపి మొత్తం ఉండగా, మొత్తం 28 టేబుల్ ల ఏర్పాటుతో 15 రౌండ్లలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి టేబుల్ కు ఒక ఎఆర్ఓ, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ సహాయకులు2, మైక్రో అబ్జర్వర్, నాలుగో తరగతి ఉద్యోగి ఉంటారని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ విధులలో జిల్లా ఎన్నికల అధికారి, అబ్జర్వర్లు 4, ఆర్ ఓ లు 7, ఎ ఆర్ ఓ లు, కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు ఇతర ఉద్యోగులు కలిపి 1181 మంది, సహాయక సిబ్బంది 1050 మంది పాల్గొంటున్నారని తెలిపారు. అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్ననియోజక వర్గాల్లో స్థలాభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు కౌంటింగ్ హాల్ నందు కౌంటింగ్ ఏజెంట్ల అనుమతి ఉంటుందని, సహకరించాలని కోరారు. 3టైర్ సెక్యూరిటీ, మరియు అదనంగా యూనివర్సిటి ఎంట్రన్స్ వద్ద కూడా ఏర్పాటు చేయడమైనది అని, 164 సీసీ కెమెరాల ఏర్పాటు చేశామని, మెడికల్ క్యాంపు ఏర్పాటు, ఫైర్ ఫైటింగ్ ఏర్పాటు, మీడియా కేంద్రం ఏర్పాటు చేశామని అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. అథారిటీ లెటర్ ఉన్న మీడియా వారికి సమాచార శాఖ వారు కౌంటింగ్ హాల్ నందు తీసుకెళ్లడం జరుగుతుందని, ఎట్టి పరిస్థితిలో కంట్రోల్ యూనిట్ లో నమోదైన పోల్ అయిన ఓట్లు, బ్యాలెట్ కనిపించేలా వీడియోగ్రఫీ చేయరాదని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఫిక్స్డ్ కెమెరా ఏర్పాటుకు మీడియా వారికి అనుమతి ఉండదని, వారు హ్యాండ్ నందు కెమెరా తో కవరేజ్ చేసుకోవాల్సి ఉంటుందని, రిజల్ట్ ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ కు పంపడం జరుగుతుందని తెలిపారు. ప్రెస్ క్లబ్ నుండి రెండు వాహనాల ఏర్పాటుతో సమాచార శాఖ వారు మీడియా కేంద్రానికి అథారిటీ పాస్ ఉన్న మీడియా ప్రతినిధులను కౌంటింగ్ సెంటర్ వద్ద మీడియా కేంద్రం కు తీసుకు వచ్చే ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సహకారం ఎంతో అవసరం అని తెలిపారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో బాణ‌సంచా పేల్చడం, కాల్చడం పూర్తిగా నిషేధం అని పేర్కొన్నారు. విజయోత్సవ ర్యాలీలు విజేత‌లు గానీ, వారి అనుచ‌రులు గానీ, ఊరేగింపులు నిర్వ‌హించ‌డానికి వీలులేద‌ని స్ప‌ష్టం చేశారు. కౌంటింగ్ రోజున జూన్ 4 ఎలాంటి మద్యం అమ్మకాలు చేయరాదని డ్రై డే గా ప్రకటించామని తెలిపారు. లూజ్ పెట్రోల్, డీజిల్ అమ్మకం నిషేధం అని అన్నారు. బాణాసంచాలు అమ్మకాలు, పేల్చడం నిషేధం అని, కౌంటింగ్ అయిన వారం వరకు కూడా అమలులో ఉంటాయని తెలిపారు.జిల్లాలో ఎస్పీ గారు 133 పికెట్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వెనుక వైపు మరింత భద్రత కట్టుదిట్టం చేశామని, ఈవీఎంల భద్రతలో ఎటువంటి అనుమానం అవసరం లేదని తెలిపారు.

ఎస్పీ మాట్లాడుతూ పలు గ్రామాల్లో పోలీస్ పికెట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, క్యూ ఆర్ టి మొబైల్ టీం లు ఏర్పాటు చేశారని, అప్రమత్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లగరాదని హెచ్చ‌రించారు. పార్లమెంటు, శాస‌న‌ సభకు జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌లు -2024 నేప‌థ్యంలో జూన్ 04వ తేదీన లెక్కింపు ప్ర‌క్రియ‌ను శాంతియుతంగా నిర్వ‌హించేందుకు, శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎవరైనా న్యూసెన్స్ మరియు సమస్యలను ఉత్పన్నం చేసే వారు ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాయంత్రం పైన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్న నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన బందోబస్తు, మొబైల్ టీంలు క్యూఆర్టి, నిఘా ఏర్పాటు చేశామనీ, బందోబస్తు కొరకు విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టామని, తగినన్ని క్యూఆర్టీలు ఏర్పాటు, పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామని వివరించారు. సిఏపీఎఫ్ కంపెనీలు తగినన్ని అందుబాటులో ఉన్నాయని రెండు ప్లాటూన్ల రాష్ట్ర సాయుధ బలగాలు అందుబాటులో ఉన్నాయని,
ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో సుమారు 2500 మంది పోలీసు, కేంద్ర సాయుధ బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం పరిధిలో డ్రోన్ ఫ్లయింగ్ నిషేధం అని తెలిపారు. చంద్రగిరి తిరుపతి నియోజకవర్గాలలో మరింత బందోబస్తు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పెంచల కిషోర్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, ఎన్నికల సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *