-గ్రామీణ ప్రాంతాలకు మహర్థశ
-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపిన ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు మోహన్ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున విజయం సాధించి, ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన జనసేన అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ పదవీకాలంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సరికొత్త మార్గాన్ని చూపాలని రాష్ట్ర ఐక్య కాపునాడు అధ్యక్షులు బేతు రామ్మోహన్రావు ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ కు గ్రామాల పట్ల ఉన్న ఇష్టాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ శాఖలు కేటాయించడం ముదావాహమన్నారు. గవర్నర్పేటలోని లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ కు లభించిన ఈ గౌరవం రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలను, మరెన్నో అవమానాలను జయించి రాజకీయాల్లో నిలిచి గెలిచిన పవన్ కళ్యాణ్ వంటి ధీరోదాత్తుడు నేటి తరం రాజకీయాల్లో లేదన్నారు. నిస్వార్ధంగా రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే సంకల్పమే పవన్ కళ్యాణ్ కు ఈ గౌరవాన్ని తెచ్చిపెట్టిందన్నారు. ఇంత గొప్ప గౌరవ స్థానం పొందేందుకు రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం ఎల్లవేళలా ఆయనకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల తో పాటు కాపు సామాజిక వర్గం కూడా అభివృద్ధి మార్గంలో పయనించేందుకు ఒక సరికొత్త అవకాశాలు ఏర్పడ్డాయన్నారు.
Prajavartha Online Telugu News