విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి మరియు ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంయుక్త ఆద్వర్యంలో ఈ రోజు న గన్నవరం మండలం లోని వేముల పల్లి అన్నపూర్ణ మ్మ గర్ల్స్ హైస్కూల్ మరియు శ్రీ ముక్కామల జగదీశ్వరరావు జిల్లా పరిషత్ పాఠశాలల నందు 7,8,9,10 వ తరగతి బాలికలకు మెన్స్ట్రవల్ హైజిన్ గురించి, యుక్త వయస్సులొ వచ్చే మార్పులు, రుతుశ్రావ సమయం లొ తీసుకోవలిసిన జాగ్రతలు, పాడ్స్ వినియోగం, అపోహలు, రుతుశ్రావ సమయం లొ తీసుకోవలిసిన ఆహారం గురించి మహిళా మండలి ఉపాధ్యక్షులు కె.విజయ తెలియ జేయడమైనది. కౌమార దశలో శరీరంలో వచ్చే మార్పులు సాధారణమని కావున వీటిపై అవగాహనను కలిగించడం కోసం ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వాసవ్య కార్యకర్త హాసిని అన్నారు. సహకారం అందించినందుకు ప్రధాన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలను తెలియజేశారు. అవగాహన శిభిరాలలో 640 మంది బాలికలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపధ్యాయులు N. V. R. L ప్రసన్న, పార్వతి, గీత పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News