Breaking News

ఘనంగా తొలి రెవిన్యూ దినోత్సవం

-జేసి తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలే ముందు అనే విధానంలో , మార్గదర్శకాలు విషయంలో సమయానుకూలంగా ప్రవర్తించే విధానంలో అంకిత భావంతో కూడిన విధి నిర్వహణలో రెవిన్యూ ఉద్యోగులు క్రమశిక్షణ కలిగిన వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పిలుపు నిచ్చారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం తొలి రెవిన్యూ దినోత్సవానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, రెవిన్యూ అధికారులకు, సిబ్బందికి రెవిన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ ఏర్పాటు చేసిన రోజును పురస్కరించుకుని ప్రతీ ఏడాది జూన్ 20 రెవిన్యూ దినోత్సవం నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు.

కొవిడ్ సమయంలో విధుల నిర్వహణా, రూల్ తో వర్కును , బయో మెట్రిక్ తదితర ఎన్నో ఘటనలు ప్రత్యక్షముగా భాగస్వామ్యం అయ్యాయని అన్నారు.,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , సీసీ ఎల్ ఏ వద్ద పని చేసినట్లు తెలిపారు. రెవిన్యూ సంబంధ అంశాలపై విస్త్రుత స్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ శాఖలలో రెవిన్యూ, పోలీసు శాఖలు 24 x 7 సమయం విధి నిర్వహణలో భాగస్వామ్యం అవ్వాల్సి ఉంటుందని తెలిపారు. రెవిన్యూ విభాగంలో పని చేసే వ్యక్తుల వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవడం తప్పని పరిస్థితుల్లో విధి నిర్వహణ భాగస్వామ్యం అవ్వాల్సి ఉంటుందని తెలిపారు. రెవిన్యూ విభాగం లో సంఘీభావం తో కూడిన విధి నిర్వహణలో పని చెయ్యడం తప్పని సరి అని పేర్కొన్నారు. రెవిన్యూ పరంగా తీసుకునే నిర్ణయాలు , ఉత్తర్వులు జారీ చెసే సమయంలో నైపుణ్యాభివృద్ధి పెంచుకోవడం ద్వారా చక్కటి ఫలితాల సాధించడం సాధ్యం అన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకోవడం పట్ల పునశ్చరణ చేసుకోవడం ద్వారా మాత్రమే చక్కటి ఫలితాలను సాధించడం సాధ్యం అవుతుందని తేజ్ భరత్ తెలిపారు. వత్తిడి అధిగమించడం, మీకోసం కాసేపు ఆలోచన చెయ్యడం, శారీరక శ్రమ తప్పని సరి, సమాజంలో మనం ఒక్కరం అనే సృహ కలిగి ఉండడం, ప్రజలతో మమేకమై ఉండడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. సమాజ సేవలో పాల్గొనే అవకాశం ఒక్క రెవిన్యూ శాఖలో మాత్రమే సాధ్యం అవుతుందన్నారు.

జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు మాట్లాడుతూ, రెవిన్యూ దినోత్సవం నిర్వహించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ చేశారు. రెవిన్యూ విభాగం తరపున శాఖా పరంగా, విధులు కర్తవ్యాలు క్రమములో ఎప్పటి కప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు , సర్క్యులర్ లను జిల్లా స్థాయి రెవిన్యూ అధికారి నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు పుస్తక రూపంలో అందించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తీసుకున్న చొరవ ఏ జిల్లాలో కూడా చొరవ చూపిన దాఖలాలు లేవని ఆయన పేర్కొన్నారు.

ఇన్చార్జి రాజమండ్రి ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ మాట్లాడుతూ, రెవిన్యూ శాఖలో ప్రజలకు సేవా చెయ్యాలనే ఒక సహృద దృక్పథం తో రావడం జరుగుతుందని, ఆమేరకు పని చెయ్యాలని కోరడం జరిగిందన్నారు.  విధి నిర్వహణలో సంతృప్తి చెందిన ఎన్నో ఘటనలు చోటు చేసుకోవడం ఈ శాఖలో మాత్రమే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. వెబ్ ల్యాండ్ కి సంబంధించిన నూతన మార్గదర్శకాలు రూపొందించిన జేసి తేజ్ భరత్ ఈ సందర్భంగా ఆయన విధి నిర్వహణ చేసిన పనితీరును ప్రదర్శించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా రెవిన్యూ శాఖా పరంగా విధులు కర్తవ్యాలు చట్టాలు ధ్రువపత్రాలు జారీ, రెవిన్యూ సేవాలు, భూ శిస్తు వసూలు, అపరాధ రుసుములు వసూళ్లు, పంచనామా, తదితర అంశాలపై రెవిన్యూ ఉద్యోగులు వారి అనుభవాలు వివరించడం జరిగింది. రెవిన్యూ ఉద్యోగులకు డ్రెస్ కోడ్, ఒక జెండా రూపకల్పన చేసే ఆలోచన చేసి , ఆమేరకు ప్రభుత్వానికి సిఫార్సు చెయ్యాలని సూచించారు.

ఈ సందర్భంగా రిటైర్డు డిఆర్వో ఎమ్. జితేంద్ర, రిటైర్డ్ పరిపాలన అధికారి కె. శ్రీనివాస రావు, రిటైర్డ్ తహసీల్దార్  లు ఏం ఆర్ కే గణేశ్వర రావు , సి వి సూర్యనారాయణ , కే. చంద్ర శేఖర్ తదితరులను ఘనంగా సన్మానించారు. పలువురు రెవిన్యూ ఉద్యోగులకు జేసి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కెఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్. కృష్ణ నాయక్, రిటైర్డ్ డి ఆర్ వో ఎమ్. జితేంద్ర, కె. శ్రీనివాస్ రావు, రిటైర్డ్ తహసీల్దార్ లు, కలెక్టరేట్ అధికారులు, రెవిన్యూ అధికారులు, సిబ్బంది, యూనియన్ నాయకులు బాపిరాజు తదితరులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *