-సామాజిక మాధ్యమాల్లో వొచ్చే ప్రకటన పట్ల జాగ్రత్త అవసరం
-ఆర్బిఐ, డిఆర్డిఏ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్థిక అక్షరాస్యత పై సమాజంలో ప్రతీ ఒక్కరూ కనీస అవగాహన కల్పించడం కోసం ఈ ప్రత్యేక శిక్షణ తరగతులు యెుక్క ముఖ్య ఉద్దేశ్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్క్ మహన పేర్కొన్నారు.
స్థానిక షెల్టన్ హోటల్ నందు ఆర్ధిక అక్షరాస్యత పై స్వయం సహాయక సంఘాల మహిళకి ఆర్బిఐ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్బిఐ జనరల్ మేనేజర్ ఆర్ కే మహణ మాట్లాడుతూ, ప్రతి మహిళల ఆర్ధిక అక్షరాస్యత విషయంలో కనీస అవగాహన కలిగివుండటం ద్వారా ఈ విషయములో సమాజాన్ని కూడా చైతన్య వంతులను చెయ్యడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలకు అమలు చేస్తూ, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తున్నట్లు తెలిపారు.
డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు మహిళలు బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను ఆదాయ మార్గాలను పెంచుకునే క్రమములో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్యాంకు రుణాలను సక్రమంగా వినియోగించుకోవాలని, తద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వాలు అందచేసే ప్రోత్సహాలు పొందాలని సూచించారు.
ఆర్బిఐ ఏ జీ ఎమ్ పూర్ణిమ మాట్లాడుతూ, నేడు సైబర్ నేరాలు బారిన పడి డబ్బులు నష్టపోవడం జరుగుతోందని అన్నారు. నిరక్షరాస్యులే కాకుండా విద్యావంతులు, ఉన్నత ఉద్యోగాలు చేసే వారు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతుండడం రోజు పేపర్ల లో, సామాజిక మాధ్యమాల్లో చేస్తున్నామన్నారు. వీటి బారిన పడకుండా ఉండాలంటే వాట్సాప్ లో వచ్చే లింక్స్ open చేయడం వల్ల కలిగే నష్టాలు, తెలిసిన వారి వాయిస్ లో మాట్లాడి అమౌంట్ ట్రాక్ చెయ్యడం వంటి వాటి విషయములో జాగ్రత్త అవసరం అన్నారు. బ్యాంకు ఖాతాలకు, ఏ టీ ఎమ్ లకు సంబంధించిన పిన్ నెంబర్ కానీ, ఫోన్ ను వొచ్చే ఓ టీ పి (వన్ టైం పాస్ వర్డ్) ఎవ్వరికీ తెలియ చెయ్యకుండా జాగ్రత్త వహించడం ద్వారా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా మన డబ్బు ను సురక్షితంగా ఉంచుకోలుగు తామని అన్నారు.
ఆర్ధిక అక్షరాస్యత విషయంలో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండడం వల్ల ఇతరుల ద్వారా మోసపోయే అవకాశం ఉండదని తెలియజేసినారు. ఆధార్ అందరికీ షేర్ చెయ్యరాదు.మొబైల్ లో M Aadhar app ఇన్స్టాల్ చేసుకోవడం, రేషన్ డిపోల్లో, ల్యాండ్ రిజిస్ట్రేషన్, మొదలగు సమయాల్లో వెలి ముద్రలు వేసేటప్పుడు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం అని స్పష్టం చేశారు.
ఆర్ధిక ప్రయోజనం, చేకూర్పు కల్పించే ఉద్దేశంతో బ్యాంక్ లు స్వయం సహయక సంఘాలకు రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అందచేసే రుణ మంజూరు విధి విధానాలు పై ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ వి వి ఎస్ మూర్తి అవగాహన కల్పించడం జరిగింది. పిఎం ఎఫ్ ఎం ఈ, పిఎం ఈజిపి, స్టాండ్ అప్ ఇండియా,. పిఎం విశ్వ కర్మ, ముద్రా, పిఎం స్వానిధి, పిఎం వీధి వ్యాపారులకు రుణాలు పై అవగాహన కల్పించారు.
*బ్యాంక్ ప్రొవైడ్ చేయు ఇన్స్యూరెన్స్ స్కీమ్స్ అయిన జీవన్ జ్యోతి బీమా యోజన, జననీ సురక్ష యోజన , సుకన్య సమృద్ధి యోజన పథకాలపై ఎల్ డి ఎం వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్బిఐ అధికారులు, స్వయం సహాయక సంఘాలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News