Breaking News

న్యాక్ ఆధ్వర్యంలో రిమాండు ఖైదీలకు 49 రోజుల శిక్షణా తరగతులు

-ప్లబ్బింగ్ లో శిక్షణ పొందిన రిమాండ్ ఖైదీలకు ధ్రువపత్రాలు అందచేత
-ఎస్ రాహుల్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర కారాగారంలో ఖైదీ సోదరులకు ప్లంబింగ్ కోర్స్ నందు శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం కేంద్రకారాగారములో (APSLSA) ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అధారిటి (CSR ఫండ్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్) ప్లంబింగ్ కోర్సును (NAC) నేషనల్ అకాడమిక్ కన్స్ట్రక్షన్స్ వారిచే 36 రిమాండ్ ముద్దాయిలకు తేది: 03-05-2024 నుండి 20-06-2024 వరకు 49 రోజుల పాటు శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగినదని కేంద్ర కారాగారము పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్లంబింగ్ శిక్షణా తరగతులను జె. ఆనంద్ కుమార్, ఇన్స్ట్రక్టర్ ప్లంబింగ్ & సానిటేషన్, యన్. యన్. మహేష్, సీనియర్ డెమో ప్లంబింగ్ & సానిటేషన్, వారిచే శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగినదనీ తెలిపారు. శిక్షణా తరగతుల చివరి రోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి పర్యవేక్షణాధికారి శ్రీరామ రాహుల్ శిక్షణా తరగతులను జరిగిన విధానం, తద్వారా కలిగిన ప్రయోజనం గురించి ముద్దాయిలతో అడిగి తెలుసుకోవడము జరిగినది. దైనందిన జీవితంలో ప్లంబింగ్ అన్నది ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. కావున మీరు నేర్చుకున్న ప్లంబింగ్ విద్యను సక్రమంగా సద్వినియోగం చేసుకున్నట్లయితే మీరు మీ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటు అందిచగలదని, సమాజంలో గౌరవంగా జీవించే అవకాశం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ యం. రాజకుమార్, బి. రత్నరాజు, జైలర్లు ఆర్. శ్రీనివాసులు, కె. దుర్గరమేష్, కె.వి. రామారావు, సి.హెచ్. రమేష్, డిప్యూటీ జైలర్లు ఇతర సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *