విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(సిబిసి) ఆధ్వర్యంలో నగరంలోని బీచ్ రోడ్డులో గల యోగా విలేజ్ వద్ద భారీ చిత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వం యోగాను నిత్వ జీవితంలో అలవర్చుకోవాలని పిలుపునివ్వడంతో ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యోగా విలేజీ వద్ద ఐదు రోజుల పాటు భారీ చిత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు సిబిసి ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డెరెక్టర్ జనరల్ శ్రీ రాజీంద్ర చౌదరీ తెలిపారు. ఈ చిత్రప్రదర్శనను విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ మతుకుమిల్లి శ్రీ భరత్ ప్రారంభిస్తున్నారు. ఈ ఐదురోజుల చిత్రప్రదర్శనను విశాఖనగరవాసులు పెద్ద సంఖ్యలో తిలకించి మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా విశిష్ఠతను తెలుసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు యోగాసనాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఐదు రోజుల పాలు బీచ్ రోడ్ యోగా విలేజీ వద్ద నిర్వహించే ఈ ఉచిత ప్రదర్శనను ప్రజలు వినియోగించుకోవాలని చౌదరీ కోరారు.
Prajavartha Online Telugu News