Breaking News

ప్రజలకు చేరువగా ఉండే శాఖ రెవెన్యూ శాఖ

-సంతృప్తి స్థాయిలో ప్రజల సమస్యలపై రెవెన్యూ సిబ్బంది పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టరు ప్రవీణ్ కుమార్
-రెవిన్యూ శాఖ తల్లి లాంటిది : జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సంతృప్త స్థాయిలో ప్రజల సమస్యలపై రెవెన్యూ సిబ్బంది పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు జరిగిన రెవెన్యూ దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ దినోత్సవం సందర్భంగా రెవెన్యూ సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రజలకు రెవెన్యూ సిబ్బంది చేరువగా ఉండి ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం చూపేలా పని చేయాలని అన్నారు. ఈ రోజు రెవెన్యూ దినోత్సవం (రెవెన్యూ డే) నిర్వహించడం జరిగిందని తెలిపారు. గ్రీవెన్స్, భూములు, తదితర సమస్యలకు సంబందించిన సేవలపై బాధ్యతగా ఉండాలన్నారు. ప్రజలకు అందించే సేవలపై ఏ స్థాయిలో ఎలా చేయాలనే విషయాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. రెవెన్యూ శాఖ విపత్తు, ప్రకృతి వైపరీత్యాల వంటి సమయాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. రెవెన్యూ దినోత్సవంను ప్రతి మండల, గ్రామ స్థాయిలో నిర్వహించాలని తెలిపారు. రెవెన్యూ శాఖకు సంబందించిన సమస్యల పరిష్కారంపై రెవెన్యూ అసోసియేషన్ పాత్ర ఎంతైనా ఉందని తెలిపారు. రెవెన్యూ సిబ్బందికి కంప్యూటర్ పైన నైపుణ్యం కలిగి ఉండాలని తెలిపారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ విపత్తు, ప్రకృతి వైపరీత్యాల వంటి సమయాలలో సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. అన్ని శాఖలకంటే రెవెన్యూ శాఖ చాలా ముఖ్యమైనదని, దాని ప్రాముఖ్యతను పెంచాల్సిన అవసరం రెవెన్యూ సిబ్బందిపైన ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ పైన నైపుణ్యం పొందడం వలన వారి పనితనం పెంచుకోవచ్చు అన్నారు. రెవెన్యూ సిబ్బంది ఇంకా బాగా పని చేసి శాఖకు మంచిపేరు తీసుకురావాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూశాఖలో ఉత్తమ సేవలందించి పదవీ విరమణ చేసిన ఉద్యోగులను శాలువాతో ఘనంగా సత్కరించి, మోమెంటో లు అందజేశారు.

డి ఆర్ ఓ మాట్లాడుతూ.. ప్రజలకు అందించే సేవల రివ్యూల కోసం రెవెన్యూ దినోత్సవం కార్యక్రమాలను క్రమ తప్పకుండా జరుపుకోవాలని అన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించడంలో వీఆర్వోలు పాత్ర ముఖ్యమైనది. రెవెన్యూ శాఖ సిబ్బంది డ్రాప్టింగ్, చట్టాలు గురిoచి అవగాహన చేసుకుని శాఖ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళీ, ఏ.పి రెవెన్యూ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి, కలెక్టరేట్ ఏవో గంగయ్య, రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు, కలెక్టరేట్ లోని రెవెన్యూ శాఖ సిబ్బంది, తదితరుల పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *