Breaking News

ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన పథకం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన (PMKVY 4.0) పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ(APSSDC) వారి సౌజన్యంతో జిల్లాలలో గల నిరుద్యోగ యువతకు ఆయా ప్రాంతాలలో గల పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలకు అనుగుణంగా ఆయా రంగాలలో శిక్షణ ఇచ్చి,ఉపాది కల్పించుట కొరకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబడింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (NAC) నందు స్కిల్ హబ్ ను ఏర్పాటు చేయడమైనది. ఈ శిక్షణ సంస్థ నందు క్రింద తెలిపిన శిక్షణా కార్యక్రమం ద్వారా యువతకు అధునాతన శిక్షణ తో పాటు ఉపాది కల్పించడమే కాకుండా పరిశ్రమలకు సుశిక్షణతో కూడిన ప్రతిభావంతమైన మానవవనరులను అందుబాటులోకి తీసుకురావడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం .
కోర్స్ ల వివరాలు : కాలవ్యవధి విద్యార్హత
Assistant Surveyor 270గంటలు 10+2 వ తరగతి/ఆపైన
Assistance Electrician 390 గంటలు 10 వ తరగతి/ఆపైన
శిక్షణా కార్యక్రమానికి సంబందించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనది. కావున ఆసక్తి గల యువతీ యువకులు ఈ నెల 24/06/2024 వ తేదీలోపు NAC-SKILLHUB, Opp. Medical College,Alipiri Road ,Tirupati, క్రింద తెలిపిన నంబర్లను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోగలరని తెలియజేయడమైనది. మరిన్ని వివరాల కొరకు సెల్: 9700413939,9866241270,9676474274, 9703437472, 7981155147 సంప్రదించవచ్చును.
శిక్షణ ప్రత్యేకతలు :
* పూర్తిగా ఉచిత శిక్షణ మరియు 100% ఉద్యోగం కల్పించబడును.
* ఇది నాన్ రెసిడెన్షియల్ శిక్షణ కావున రోజులో 4 గంటలు మాత్రమే.
* 15 సంII నుండి 45 సంII వరకు వయోపరిమితి కలదు.
* APSSDC&NSDC వారిచే జారీ చేయబడు NCVET సర్టిఫికెట్టు ప్రత్యేకమైనది.
* 80% ప్రాక్టికల్ శిక్షణ మరియు 20% థియరీ శిక్షణ వలన ఉపాది పొందడంలో సందేహమవసరం లేదు.
* ప్రముఖ కంపెనీలు మరియు పరిశ్రమలందు ఉపాధి కల్పించడం మరో ప్రత్యేకత అని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాధం ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *