Breaking News

ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పోరేషన్ పై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పోరేషన్ పై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్ లో అధికారులతో సమావేశం అయ్యారు. ప్రస్తుతం సోలార్ పవర్ కార్పోరేషన్ కు సంబంధించిన స్థితిగతులపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోలార్ పార్కులను ఏర్పాటు చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. ఈ విధంగా రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని వివరించారు. ప్రజావసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ ఛీప్ సెక్రెటరీ  కే. విజయానంద్, ఏపీ సోలార్ పవర్ కార్పోరేషన్ ఎండీ  ఎం. కమలాకర్ బాబు, ఎనర్జీ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రెటరీ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *