Breaking News

అనంతపురంలో పోలీసుల వేధింపులకు గురైన కుటుంబాన్ని ఆదుకుంటాం

-రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనంతపురం లో పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్య కు పాల్పడిన అబ్దుల్లా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఈ ఘటనకు కారుకులైన దోషులను శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. రాష్ట్ర మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ నేతృత్వంలో ఆత్మహత్య కు పాల్పడిన అబ్దుల్లా భార్య నదీమ, కొడుకు మొహమ్మద్ అయాన్ (7 సం||లు), కూతురు సమీన (12 సం||లు) గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరిన నేపథ్యంలో పై విధంగా మంత్రి స్పందించారు. మృతుడి భార్య నసీమా తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మంత్రికి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఈ అంశంపై స్పందించి దోషులను శిక్షించి, తమ కుటుంబ జీవనోపాధికి ఉద్యోగాన్ని, పిల్లలు చదువుకు తోడ్పాటును అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా మంత్రి స్పందిస్తూ మైనార్టీ ప్రభుత్వ సంస్థలో తాత్కాలిక ఉపాధిని కల్పిస్తామని హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *