Breaking News

నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీలేని పోరాటం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తున్నామని ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా జోనల్ కమిషనర్ రమ్య కీర్తన ఇతర ప్రభుత్వ అధికారులతో కలిసి శుక్రవారం 42వ డివిజన్ లో పర్యటించారు. ప్రియదర్శిని కాలనీ హెచ్ బి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రియదర్శిని కాలనీ నుంచి హెచ్ బి కాలనీ వరకు రహదారి అనుసంధానం చేయాలని తాగునీటి పైపులకు లీకులు ఏర్పడి నీరు వృధా అవుతుందని తాగు నీటి వాటర్ ట్యాంకుకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని స్థానిక మహిళలు కొరగా తక్షణమే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే 450 sft ఫ్లాట్లవద్ద గల పార్కులో వర్షపు నీరు పోయే మార్గం లేక నీరు నిల్వ ఉండి దోమలతో ఇబ్బంది పడుతున్నామని పార్కులో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానిక వాసులు విన్నవించుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులను వేగవంతం చేస్తామన్నారు. జనావాసాల మధ్య ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి వర్షపు నీరు నిలిచి ఉండడాన్ని జోనల్ కమిషనర్ రమ్య కీర్తన పరిశీలించి తొలగించాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. హెచ్ బి కాలనీ వాసులందరూ చెత్తను పారిశుధ్య సిబ్బందికి విధిగా అందజేసి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. జనావాసాల మధ్య చెత్తను వేస్తే జరిమానా విధిస్తామని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై నియోజకవర్గ అభివృద్ధి పై గత వైసిపి పాలకులు దృష్టి పెట్టలేదని ప్రత్తిపాటి శ్రీధర్ అన్నారు. స్ట్రామ్ వాటర్ పనులు రోడ్లు సైడ్ డ్రెయిన్ల నిర్మాణం 2014-2019 మధ్యకాలంలోనే జరిగిందని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య సీతా చంద్ర శేఖర్ టిడిపి డివిజన్ ప్రెసిడెంట్ ముదిరాజ్ శివాజీ పి సాంబశివరావు జనసేన డివిజన్ ప్రెసిడెంట్ తిరుపతి అనూష జనసేన ప్రచార కమిటీ అర్బన్ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ బిజెపి మండల అధ్యక్షులు పగడాల కృష్ణ అధికారులు ఏఈ అహ్మద్ ఏఈ రవీంద్ర టౌన్ ప్లానింగ్ సిబ్బంది శానిటరీ ఇన్స్పెక్టర్ బ్రహ్మారెడ్డి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *