-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ఇటీవల గుండెపోటుతో మరణించిన టిడిపి కార్యకర్త పక్కుర్తి సింహాచలం కుటుంబానికి సోమవారం ఆర్థిక సాయం అందించారు.ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది మరియు 52వ డివిజన్ టిడిపి కార్పోరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు తొ కలిసి పరామర్శించి నగదు అందజేశారు. సింహాచలం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవాడని నిరుపేద అయినటువంటి సింహాచలం కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, (చంటి) సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి నగదు అందజేయమని ఆదేశాలు జారీ చేశారు. సింహాచలం భార్య సరస్వతికి ఎమ్మెల్యే కార్యాలయం పదివేలు కార్పొరేటర్ చంటి పదివేలు అందజేశారు. కూటమి కార్యకర్తలకు ఎమ్మెల్యే కార్యాలయం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News