Breaking News

సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ వి ఎమ్ గోడౌన్ పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మాస వారి తనిఖీల్లో భాగంగా ఈ వి ఎమ్ లు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ లను తనిఖీ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి  పేర్కొన్నారు. సోమవారం ఉదయం  స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఉన్న ఈ వి ఎమ్ గోడౌన్ ను కలెక్టర్ , రాజమండ్రీ ఆర్డీఓ లు సందర్శించడం జరిగింది. ఈ సంధర్బంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ప్రతి నెలా ఈవిఎమ్ గోడౌన్ సందర్శించి తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు.

సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో పొలైన బ్యాలెట్ యూనిట్స్ పార్లమెంటు నియోజక వర్గాల, అసెంబ్లి నియోజక వర్గాల వారీగా ఈవిఎమ్ యూనిట్ ( బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్స్)  అత్యంత భధ్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరచి సీసీ కెమెరాల పర్యవేక్షణా లో ఉంచడం జరిగిందన్నారు. సోమవారం అక్కడ ఏర్పాటు చేసిన సిసి కెమెరాల పనితీరును కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు తిరిగి ఆయా యూనిట్స్ సురక్షితంగా ఈ వి ఎమ్ గోడౌన్ తరలించడం జరిగిందన్నారు. వాటిని పార్లమెంటు, అసెంబ్లి సిగ్మెంట్ వారీగా వాటికి కేటాయించినా గదుల్లో భద్రపరచినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు సాధారణ తనిఖీల్లో భాగంగా ఈ వి ఎమ్ గోడౌన్ పరిశీలించినట్లు తెలియ చేశారు.

కలెక్టర్ వెంట ఈవిఎమ్ నోడల్ అధికారి / రాజమండ్రీ ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి , రాజకీయ పార్టీ ప్రతినిధులు రెవిన్యూ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పాఠశాల బస్సు డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించాలి

-విద్యార్థుల భద్రత డ్రైవర్లపై ఉన్న అత్యంత కీలక బాధ్యత -డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలి -డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు మంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *