Breaking News

కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే సుజన చౌదరి ఆర్థిక సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో 52 వ డివిజన్ పరిధిలో అనారోగ్యంతో మరణించిన విజ్జి తిరునాద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, కూటమి నాయకులతో కలిసి మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద అయినటువంటి విజ్జి తిరునాధ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని 52 వ డివిజన్ బిజెపి నాయకులు దొడ్ల రాజా సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది మంగళవారం రూ పదివేలను అందజేశారు. కార్యకర్తలకు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే సుజనాకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *