-ప్రపంచ పర్యాటక దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని ఔత్సాహికులు పాల్గొని ఉత్తమ వీడియోలు/ రీల్స్ తయారు చేసి పంపు గడువు ఈ నెల సెప్టెంబర్ 30 వరకు పెంపు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల సెప్టెంబర్ 27న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటక వారోత్సవాల నేపథ్యంలో జిల్లాలోని ఔత్సాహికులు పాల్గొని ఉత్తమ వీడియోలు/ రీల్స్ తయారు చేయాలని వాటికి బహుమతులు ఉంటాయని, వాటిని పంపాల్సిన తేదీని ఈ నెల సెప్టెంబర్ 30 వరకు పొడిగించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సెప్టెంబర్ 27న జరగనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవ నేపథ్యంలో వారోత్సవాలు పురస్కరించుకొని తిరపతి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల సమాచారాన్ని పర్యాటకులకు తెలియజేసి పర్యాటకులను ఆకట్టుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉత్తమమైన వీడియోలు/ రీల్స్ పోటీలను నిర్వహించనున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పోటీలను రెండు విభాగాలుగా కేటగిరీ 1, కేటగిరి 2 గా విభజించడం జరిగిందని తెలిపారు. కేటగిరి 1 లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం (తిరుమల),శ్రీ గోవిందరాజస్వామి ఆలయం(తిరుపతి), శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ( తిరుచానూరు), శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం (అప్పలాయగుంట), శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం ( గుడిమల్లం), శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం ( శ్రీ కాళహస్తి), శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం (నారాయణవనం), శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం ( నాగలాపురం), శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం ( సురుటుపల్లి), వాటిపై 3 నిమిషాలు నిడివి గల వీడియో, 3నిమిషాల నిడివి గల రీల్ సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. కేటగిరి 1 లో అత్యుత్తమ వీడియో లేదా రీల్స్ సమర్పించిన వారికి మొదటి బహుమతిగా రూ. 1,00,000/-, రెండవ బహుమతి గా రూ. 50,000/-, మూడవ బహుమతి గా రూ. 25,000/- అందివ్వడం జరుగుతుందని తెలిపారు.
కేటగిరి 2 లో భాగంగా తిరుపతి జిల్లాలోని ప్రముఖ విశ్రాంత మరియు ఆకర్షిత పర్యాటక ప్రదేశాలైన ఎస్ వి జూలాజికల్ పార్క్ (తిరుపతి), కళ్యాణి డ్యాం, చంద్రగిరి కోట, తలకోన జలపాతం, తలకోన, మామండూరు ఎకో టూరిజం, కైలాసనాథ కోన జలపాతం, శ్రీ సిటీ (సత్యవేడు), తూపిలిపాలెం బీచ్ (వాకాడు), ఇరకం ఐలాండ్, పులికాట్ లేక్, నేలపట్టు పక్షుల అభయారణ్యం వాటి పై వాటిపై 3నిమిషాల నిడివి గల వీడియో, 3 నిమిషాల నిడివి గల రీల్ సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. కేటగిరి 2 లో అత్యుత్తమ వీడియో లేదా రీల్స్ సమర్పించిన వారికి మొదటి బహుమతిగా రూ. 1,00,000/-, రెండవ బహుమతి గా రూ. 50,000/-, మూడవ బహుమతి గా రూ. 25,000/- అందివ్వడం జరుగుతుందని తెలిపారు.
పోటీలో తీసిన రీల్స్ మరియు వీడియోలను ‘edtpt@aptdc.in’ లేదా collector-tirupati@ap.gov.in ఈమెయిల్ ద్వారా పంపాలని తెలిపారు. పోటీలో పాల్గొను అభ్యర్థులు వారు తీసిన వీడియోలు , రీల్స్ ను 30.09.2024 వ తేది లోపు పై తెలిపిన ఈ మెయిల్ లకు పంపగలరని తెలిపారు.
ఇతర వివరములకు tirupati.ap.gov.in వెబ్సైట్ ను సంప్రదించగలరని, ప్రాంతీయ పర్యాటక కార్యాలయం తిరుపతి జిల్లా పర్యాటక అధికారి వారి నం : 6309942027, ఇతర నెంబర్లు 9848823086,9705933311 ను సంప్రదించగలరని తెలిపారు.
Prajavartha Online Telugu News